పాఠశాలకు వెళ్లి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన పిల్లలు మహమ్మారికారణంగా ఇంటికే పరిమితమయ్యారు. ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నా.. ప్రయోజనం అంతంతమాత్రంగానేఉంటోంది.రోజంతా ఆటపాటలతో గడిపేస్తూ వారి విలువైన సమయాన్ని వృథాచేసుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఓ ఆరేళ్ల బాలిక..ప్రత్యేక గ్రంథాలయాలు ఏర్పాటు చేసింది.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన మిర్జా మరియం.. మొహల్లా లైబ్రెరీ పేరుతో నగరంలోని మురికివాడల్లోఉచిత గ్రంథాలయాలను నిర్వహిస్తోంది. 6వ తరగతి చదువుతున్న మరియం..తండ్రి సాయంతో11 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసింది.
మరియం ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీల్లో ఒక్కో దాంట్లో సుమారు500పుస్తకాలు ఉంటాయి.
"లాక్‌డౌన్‌తో పాఠశాలలు మూతపడ్డాయి.దీంతో పిల్లలు అంతా తమ విలువైన సమయాన్ని ఆటలకే పరిమితం చేశారు.ఆన్లైన్ క్లాసులు ఉన్నా ఎలాంటి ఉపయోగం ఉండట్లేదు. ఇందుకోసమే నేను ఈ లైబ్రరీలను ప్రారంభించాలని అనుకున్నాను. మా నాన్న గతేడాది నాకు బహుమతిగా150 పుస్తకాలను ఇచ్చారు.ఈ పుస్తకాలను, నా వద్ద ఉన్న మరో150 పుస్తకాలు సహా మరికొన్నింటిని సేకరించి గ్రంథాలయాలను ఏర్పాటు చేశాను."
-మిర్జా మరియం, విద్యార్థిని