Clashes in Telangana Polling Stations : తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) ప్రశాంతంగా జరుగుతుండగా.. కొన్నిచోట్ల చెదురుమదురు ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని విజయమేరి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ చెలరేగింది. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
జనగామలోని 245వ నంబర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ కార్యకర్తలు,.. బీఆర్ఎస్‌కు మధ్య ఘర్షణ నెలకొంది. ఇరుపార్టీల నేతలు పరస్పరం ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. పార్టీ నాయకులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఖానాపూర్‌లో.. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య గొడవ జరిపింది. ఈ నేపథ్యంలో పోలీసుల లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
అడుగడుగునా పోలీసుల నిఘా - లక్షమంది బలగంతో పటిష్ఠ బందోబస్తు
Congress and BRS Clashes at Polling Stations : జోగులాంబ గద్వాల జిల్లా.. ఐజా ప్రభుత్వ పాఠశాలపోలింగ్ కేంద్రం వద్ద (Clashes in Telangana) వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకులు, పోలీసులకు మధ్య గొడవ జరిగింది. బీఆర్ఎస్ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారని.. పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని హస్తం పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ పోలింగ్ కేంద్రం వద్ద తోపులాట జరిగింది. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ భారత్ రాష్ట్ర సమితి, హస్తం పార్టీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఓటు వేయడానికి ఫ్రీగా ర్యాపిడో బుక్ చేసేయ్ - ఓటింగ్ శాతాన్ని పెంచేయ్