తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​-పాక్ మ్యాచ్​లో ఓటమిపై విద్యార్థుల ఫైట్ - టీ20 ప్రపంచకప్

ఆదివారం భారత్- పాకిస్థాన్​ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం.. పంజాబ్​లోని ఓ ప్రైవేట్ కాలేజీ హాస్టల్​లో విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. కశ్మీర్, యూపీ, బిహార్ యువకుల మధ్య మొదలైన వాదోపవాదాలు.. దాడులకు దారి తీసినట్లు తెలుస్తోంది.

Clash between students after Indo-Pak Match in punjab
భారత్ పాకిస్థాన్ మ్యాచ్

By

Published : Oct 25, 2021, 1:01 PM IST

Updated : Oct 25, 2021, 1:54 PM IST

భారత్​-పాక్ మ్యాచ్​లో ఓటమిపై విద్యార్థుల ఫైట్

టీ20 ప్రపంచకప్​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో (India vs Pakistan T20) భారత్ ఘోర పరాజయం తర్వాత.. పంజాబ్​ సంగ్రూర్​లోని ఓ కళాశాల హాస్టల్​లో ఉద్రిక్తత తలెత్తింది. కశ్మీర్​కు చెందిన విద్యార్థులతో.. బిహార్, యూపీ విద్యార్థులు ఘర్షణ పడ్డారు.

విద్యార్థుల చేతిలో కర్రలు

ఆదివారం రాత్రి కశ్మీర్, యూపీ, బిహార్​కు చెందిన విద్యార్థులు తమ తమ గదులలో మ్యాచ్ (India vs Pakistan T20 world cup) వీక్షించారని పోలీసులు తెలిపారు. మ్యాచ్ ముగిసిన తర్వాత పలువురు విద్యార్థులు నినాదాలు చేశారని వెల్లడించారు. దీంతో విద్యార్థుల మధ్య వాదన మొదలైందని చెప్పారు.

హాస్టల్ గదిలో ధ్వంసమైన సామగ్రి

ఈ వాదన క్రమంగా దాడులకు దారి తీసినట్లు తెలుస్తోంది. కశ్మీరీ విద్యార్థులపై, యూపీ, బిహార్ విద్యార్థులు దాడి చేశారని సమాచారం. అనంతరం వివాదం సద్దుమణిగిందని సంబంధిత వ్యక్తులు తెలిపారు.

వీడియోలు వైరల్

దాడికి సంబంధించినవిగా చెబుతున్న పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. యూపీ విద్యార్థులు తమ గదుల్లోకి వచ్చి, గొడవ పడ్డారని కశ్మీరీ విద్యార్థులు ఆరోపించారు. తమ గదుల్లోని వస్తువులను ధ్వంసం చేశారని అన్నారు.

ఇదీ చదవండి:IND VS PAK: టీమ్​ఇండియా ఓటమికి కారణాలు ఇవేనా..!

Last Updated : Oct 25, 2021, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details