Punjab Patiala clash: పంజాబ్‌లోని పటియాలాలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు కర్ఫ్యూకు దారి తీసాయి. శుక్రవారం కాళీ మందిర్ ప్రాంతంలో శివసేన నేతలు ఖలిస్థాన్ వ్యతిరేక ర్యాలీ చేపట్టగా, మరో వర్గం అడ్డుకుంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు రాళ్ల దాడి చేసుకోగా, పలువురు గాయపడ్డారు. గొడవలను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. పటియాలాకు అదనపు బలగాలు రప్పించామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పంజాబ్ పోలీసులు తెలిపారు. జరిగిన సంఘటనపై కొందరు వదంతులను వ్యాప్తి చేస్తున్నారని విమర్శించారు.
శివసేన ర్యాలీలో ఉద్రిక్తత.. రెండు వర్గాల రాళ్ల దాడులు - శివసేన
Punjab Patiala clash: పంజాబ్ పటియాలాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు పోలీసులు.
clash-between-shiv-sena-and-khalistan-supporters-in-patiala
ఈ ఘటనపై పంజాబ్ సీఎం మాన్ స్పందించారు. ఇలా జరగడం చాలా దురదృష్టకరమన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పంజాబ్లో శాంతి, సామరస్యం నెలకొల్పడమే తమ లక్ష్యమని అన్నారు సీఎం భగవంత్ మాన్.
ఇదీ చూడండి:క్యాబ్ డ్రైవర్ను హత్యచేసిన మైనర్లు.. 32సార్లు కత్తితో పొడిచి..
Last Updated : Apr 29, 2022, 10:34 PM IST