తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ మేయర్​ ఎన్నికల్లో గందరగోళం.. భాజపా ఆప్​ కార్పొరేటర్ల మధ్య తోపులాట - భాజపా ఆప్​ కార్పొరేటర్ల మధ్య తోపులాట

దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మేయర్‌ ఎన్నికలో గందరగోళం నెలకొంది. మేయర్​ ఎన్నికకు సంబంధించి ప్రిసైడింగ్‌ అధికారి నియామకం విషయంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌పై ఆప్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలో ఆప్‌-భాజపా మధ్య తోపులాట జరిగింది. ఫలితంగా.. మేయర్ ఎన్నిక జరగకుండానే సభ వాయిదా పడింది.

delhi bjp and aap councillors clash
delhi bjp and aap councillors clash

By

Published : Jan 6, 2023, 1:03 PM IST

Updated : Jan 6, 2023, 2:11 PM IST

దిల్లీ మేయర్​ ఎన్నికల్లో గందరగోళం.. భాజపా ఆప్​ కార్పొరేటర్ల మధ్య తోపులాట

దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ మేయర్ ఎన్నికలో తీవ్ర గందరగోళం నెలకొంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా.. 10 మంది కో-ఆప్షన్ సభ్యులను నియమించడంపై.. ఆమ్‌ ఆద్మీ పార్టీ, భాజపా కార్పొరేటర్లు పరస్పరం వాగ్వాదానికి దిగారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు.. ప్రిసైడింగ్ అధికారిగా భాజపా కార్పొరేటర్‌ సత్యశర్మను.. లెఫ్టినెంట్ గవర్నర్‌ నియమించడంపైనా ఆప్‌ నేతలు మండిపడ్డారు. మేయర్‌ ఎన్నికను ప్రభావితం చేసేందుకే సక్సేనా ఈ నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. కో-ఆప్షన్‌ సభ్యుడిగా మనోజ్‌ కుమార్‌ను ప్రమాణం చేయాలని ప్రిసైడింగ్ అధికారి ఆహ్వానించడంపై అభ్యంతరం వ‌్యక్తం చేసిన ఆప్‌ నేతలు.. వెల్‌లోకి దూసుకెళ్లారు. అందుకు పోటీగా.. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా భాజపా సభ్యులు నినాదాలు చేశారు. ప్రధాని మోదీ లక్ష్యంగా ఆప్‌ నేతలు నినాదాలు చేశారు. ఫలితంగా సభ మొత్తం గందరగోళంగా మారింది. దీంతో, కొత్తగా ఎన్నికైన దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మొదటి సభ.. మేయర్​, ఉప మేయర్లను ఎన్నుకోకుండానే వాయిదా పడిందని ప్రిసైడింగ్​ అధికారి తెలిపారు. సభ జరిగే తదుపరి తేదీని తర్వాత ప్రకటిస్తామని చెప్పారు.

మొత్తం 250 మంది ఎన్నికైన కార్పొరేటర్లతోపాటు ఏడుగురు భాజపా లోక్‌సభ ఎంపీలు.. ఆప్‌నకు చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, 14మంది ఎమ్మెల్యేలు.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఓటు వేయనున్నారు. 9మంది సభ్యులున్న కాంగ్రెస్ ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆప్ 134, భాజపా 104 వార్డుల్లో విజయం సాధించాయి. ఆప్‌ తరఫున మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్‌ను కేజ్రీవాల్ ప్రతిపాదించగా.. భాజపా తరఫున రేఖా గుప్తా మేయర్ బరిలో నిలవనున్నారు.

Last Updated : Jan 6, 2023, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details