రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ(CJI Ramana) బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అందిస్తున్న ఉచిత న్యాయసేవల గురించి అక్టోబర్ 2న ప్రజాచైతన్య కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి పాల్గొంటున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్ల గురించి జస్టిస్ రమణ(Justice Ramana news) ఆయనకు వివరించినట్లు తెలిసింది.
రాష్ట్రపతి కోవింద్‌తో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ భేటీ
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ(CJI Ramana) సమావేశమయ్యారు. జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అందిస్తున్న ఉచిత న్యాయసేవలపై అక్టోబర్ 2న నిర్వహించనున్న ప్రజాచైతన్య కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై జస్టిస్ రమణ(Justice Ramana news) వివరించారు.
రాష్ట్రపతితో ప్రధాన న్యాయమూర్తి భేటీ
జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ పేట్రన్ ఇన్ చీఫ్‌గా ఉన్న జస్టిస్ రమణ(Justice Ramana news), ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న జస్టిస్ యూయూ లలిత్ సంయుక్తంగా సెప్టెంబర్ 20వ తేదీన రాష్ట్రపతిని కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ రమణ మరోసారి రాష్ట్రపతితో సమావేశమై పూర్తి వివరాలను నివేదించారు.
ఇదీ చూడండి:దిల్లీకి 15 మంది ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు