తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మా ప్రతిపాదనలు ఆమోదించినందుకు ధన్యవాదాలు: సీజేఐ - సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

CJI NV Ramana: కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏర్పాటు, న్యాయమూర్తుల నియామకం సహా పలు తీర్మానాలను ఆమోదించినందుకు కేంద్రానికి ధన్యావాదాలు తెలిపారు సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ. కోర్టుల అనుసంధానం తక్షణమే పరిష్కరించాల్సిన అంశమని అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

d
d

By

Published : Apr 30, 2022, 8:30 PM IST

CJI NV Ramana: ముఖ్యమంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల రెండు రోజుల సదస్సులో అనేక కీలక అంశాలను చర్చించినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారు. సదస్సులో తీసుకున్న నిర్ణయాలను న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజుతో కలిసి ఆయన వెల్లడించారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏర్పాటు, న్యాయమూర్తుల నియామకం సహా పలు తీర్మానాలను ఆమోదించినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ పోర్టల్‌పై న్యాయశాఖ మంత్రితో చర్చించినట్లు తెలిపారు.

విశ్రాంత న్యాయమూర్తుల బెనిఫిట్స్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి చేయాలని జస్టిస్‌ రమణ సూచించారు. కోర్టుల అనుసంధానం తక్షణమే పరిష్కరించాల్సిన అంశం అని అన్నారు. కోర్టుల నెట్‌వర్క్‌కు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించి సహకరించాలని సీజేఐ విజ్ఞప్తి చేశారు. తమ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జస్టిస్‌ రమణ ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు కట్టుబడి ఉన్నామని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.

ముఖ్యమైనవి అని మేం అనుకున్న అంశాలపై సదస్సులో శుక్రవారం, శనివారం చర్చించాం. 2016 ఏప్రిల్‌ సదస్సులో ఆమోదించిన తీర్మానాల అమలును సమీక్షించాం. మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏర్పాటుపై నేను చేసిన ప్రతిపాదించినపై చర్చించాం. జిల్లా కోర్టుల్లో మానవ వనరులు, పర్సనల్‌ పాలసీ, అక్కడి అవసరాలు, హైకోర్టు, జిల్లా న్యాయమూర్తులు, కింది స్థాయి ఉద్యోగుల నియామకంపై చర్చ జరిగింది. వ్యవస్థాగతమైన, న్యాయపరమైన సంస్కరణలపై చర్చించాం. సుమారు ఆరు అంశాలపై శుక్రవారం మేం చర్చించాం. శనివారం.. వాటికి సంబంధించిన తీర్మానాలు, అంశాలను ముఖ్యమంత్రుల ముందుకు తీసుకువచ్చాం.

-జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సు చాలా అర్థవంతంగా జరిగింది. ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు తమ ఆలోచనలు, అభిప్రాయాలను స్వేచ్ఛగా, బహిరంగంగా పంచకున్నారు. చాలా అంశాలను లేవనెత్తారు. పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించాం. సదస్సులో తీసుకున్న నిర్ణయాలు, ఇక్కడ ఏకాభిప్రాయం వచ్చిన అంశాలకు అందరి మద్దతుతో పూర్తి రూపం తీసుకురావడానికి మేం కట్టుబడి ఉన్నాం.

-కిరణ్‌ రిజిజు, కేంద్ర న్యాయశాఖ మంత్రి

ఇదీ చూడండి :ఆర్మీ చీఫ్​గా జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు.. నరవణెకు వీడ్కోలు

ABOUT THE AUTHOR

...view details