CJI NV Ramana: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బౌలర్‌గా మారారు. బార్ అధ్యక్షుడు వికాస్ సింగ్‌కు బౌలింగ్ వేసిన సీజేఐ.. మూడో బంతికి వికెట్ పడగొట్టారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన.. బౌలింగ్‌తో టోర్నీని శనివారం ప్రారంభించారు.
సుప్రీంకోర్టు బార్ అధ్యక్షుడికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ బౌలింగ్..! - సుప్రీంకోర్టు న్యాయమూర్తి
CJI NV Ramana: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని క్రికెట్ టోర్నీని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడికి బౌలింగ్ వేశారు. మేధో సంపత్తి హక్కులకు సంబంధించిన వివాదాల పరిష్కారంపై నిర్వహించిన సెమినార్‌లో కూడా జస్టిస్ రమణ పాల్గొన్నారు.
అంతకుముందు.. దిల్లీ హైకోర్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలోని న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాల కల్పనలో ప్రాథమిక ప్రమాణాల లోపాలు ఉన్నాయని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మేధో సంపత్తి హక్కుల వ్యాజ్యాలను సమర్ధవంతంగా విచారణ జరిపేందుకు హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో సమస్యల పరిష్కారానికి న్యాయవ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. మేధో సంపత్తి హక్కులకు సంబంధించిన వివాదాల పరిష్కారంపై దిల్లీ హైకోర్టు నిర్వహించిన జాతీయ సెమినార్‌లో జస్టిస్ ఎన్వీ రమణతోపాటు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలు హైకోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. మేధో సంపత్తి హక్కుల పరిష్కారానికి న్యాయవ్యవస్థ ప్రత్యేక ట్రైబ్యునల్ బోర్డును ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి :Indians in Ukraine: 219 మంది భారతీయులతో బయల్దేరిన విమానం