CJI NV Ramana: దేశంలోని వివిధ హైకోర్టుల్లో జడ్జీల నియామకానికి పేర్లను సూచించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంబంధిత హైకోర్టు చీఫ్ జస్టిస్లను కోరారు. ఖాళీలను భర్తీ చేయడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సమష్టి కృషితో వివిధ హైకోర్టులలోని 126 ఖాళీలను ఒక సంవత్సరం లోపు భర్తీ చేయగలిగామని.. త్వరలో మరో 50 నియామకాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
జస్టిస్ ఎన్వీ రమణ అధ్యక్షతన సుప్రీంకోర్టు ఆవరణలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సు నిర్వహించారు. ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ సదస్సు జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్ సహా అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హజరయ్యారు.