తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పోలీసు యంత్రాంగాన్ని రాష్ట్రాలు దుర్వినియోగం చేయకూడదు' - జస్టిస్‌ ఎన్‌వీ రమణ తాజా సమాచారం

పోలీసు యంత్రాంగాన్ని రాష్ట్రాలు దుర్వినియోగం చేయకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తనపై ఓ శాసనసభ్యుడు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసిన మహిళపై పోలీసులు నాలుగు క్రిమినల్‌ కేసులు నమోదు చేయడాన్ని జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆక్షేపించారు.

CJI justice NV Ramana
CJI justice NV Ramana

By

Published : Feb 4, 2022, 5:33 AM IST

పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామి కాకూడదని సుప్రీంకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. పంజాబ్‌కు చెందిన లోక్‌ ఇన్సాఫ్‌ పార్టీ శాసనసభ్యుడు సిమర్జీత్‌ సింగ్‌ బైన్స్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసిన ఓ మహిళపై పోలీసులు నాలుగు క్రిమినల్‌ కేసులు నమోదు చేయడాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. ఆమెపై వీటిల్లో విచారణ జరపకుండా రెండు వారాల స్టే విధించింది. నిందితుడిని అరెస్టు చేయకుండా విధించిన స్టే ఉత్తర్వులను మరో వారం పొడిగించింది. బాధితురాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వేర్వేరుగా దాఖలు చేసిన అర్జీలను సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ హిమాకోహ్లిల ధర్మాసనం విచారించింది.

"మీ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఆ మహిళపై ఎన్ని కేసులు పెట్టారు? నిందితుడు ముందస్తు బెయిల్‌ను కోరుతున్నారు. ఆ మహిళే జైలుకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. పోలీసు వ్యవస్థను ఇలా దుర్వినియోగం చేయడంలో రాష్ట్రం భాగస్వామి కాకూడదు" అని పేర్కొంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ప్రజల్ని ఎలా వేధిస్తున్నారో చూడాలని నిందితుని తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీకి సూచించింది. ప్రజా ప్రతినిధి వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నించింది. కోర్టును ఆశ్రయించాక బాధితురాలిపై కేసులు బనాయించడాన్ని తప్పుపట్టింది. మహిళపై నమోదైన కేసులలో ఎమ్మెల్యేకు ప్రమేయం లేదని, కెనడాలో ఉద్యోగాల పేరుతో ఆమె ఒక కుంభకోణం నడుపుతోందని రోహత్గీ చెప్పారు.

ఇదీ చూడండి:చైనాపై భారత్ కన్నెర్ర- ఒలింపిక్స్ వేడుకల ప్రసారాలు బంద్​!​

ABOUT THE AUTHOR

...view details