వన్యప్రాణులను అక్రమంగా తరలించే వాళ్లే మాదకద్రవ్యాలు, తుపాకీ వ్యాపారం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే. ఇటువంటి వారిని అడ్డుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఈడీలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు అసోంలో జ్యుడిషియల్ అకాడమీ, 'ప్రపంచ వన్యప్రాణ సంరక్షణ సంస్థ' సంయుక్తంగా చేపట్టిన సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'వన్యప్రాణుల అక్రమరవాణాపై దృష్టి సారించండి' - cji bobde news
అడవి జంతువుల అక్రమరవాణాపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాలన్నారు సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే. ఈ అక్రమాలకు పాల్పడే వారే ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో భాగం అవుతున్నారని పేర్కొన్నారు.
'వన్యప్రాణల అక్రమరవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి'
అటవీ జంతువుల అక్రమ రవాణాకు సంబంధించి కఠిన చట్టాలు రావాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు జస్టిస్ బోబ్డే. చట్ట విరుద్ధంగా చేసే ఈ వ్యాపారాల్లో సంపాదించిన సొమ్ము ఇతర వ్యాపారాల్లోకి వెళుతోందన్నారు. ఇది చాలా ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. వీటిపై దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాలన్నారు.
Last Updated : Dec 20, 2020, 6:17 AM IST