భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. తదుపరి సీజేఐ ఎంపికకు కసరత్తు ప్రారంభించింది. 50వ సీజేఐగా ఎవరికి అవకాశం ఇవ్వాలో సూచించాలని కోరుతూ జస్టిస్ లలిత్‌కు లేఖ రాసింది. ఆనవాయితీ ప్రకారం సీజేఐ తన వారసునిగా అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును ప్రతిపాదిస్తారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ లలిత్ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు. సాధారణంగా.. భారత ప్రధాన న్యాయమూర్తి సూచించే పేరును కేంద్ర ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉంటుంది.
తదుపరి సీజేఐ ఎంపికపై కేంద్రం కసరత్తు.. జస్టిస్ చంద్రచూడ్‌కు అవకాశం - next cji name
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్‌కు కేంద్ర ప్రభుత్వం ఓ లేఖ రాసింది. తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలో సూచించాలని కోరింది.
supreme court
జస్టిస్ ఎన్వీ రమణ భారత ప్రధాన న్యాయమూర్తి ఆగస్టు 26న పదవీ విరమణ చేశారు. ఆగస్టు 27న సీజేఐగా బాధ్యతలు చేపట్టారు జస్టిస్ యూయూ లలిత్. ఆయన పదవీ కాలం దాదాపు 3 నెలలే. మరో నెల రోజుల్లో ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తదుపరి సీజేఐ నియామక ప్రక్రియ ప్రారంభించింది.