Civils main exam date 2021: అఖిల భారత సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఏటా నిర్వహించే సివిల్స్ సర్వీస్ మెయిన్ పరీక్షలు.. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. దేశంలో కరోనా వ్యాప్తి, పలు రాష్ట్రాల్లో ఆంక్షలు అమలు అవుతున్న నేపథ్యంలో ఈ మేరకు పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీ వివరణ ఇచ్చింది. పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ముఖ్యంగా.. కంటైన్మెంట్, మైక్రో కంటైన్మెంట్ జోన్ల నుంచి వచ్చే అభ్యర్థులు పరీక్ష సజావుగా రాసే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపింది.
UPSC main exam date 2021
అవసరమైతే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల ఈ-అడ్మిట్ కార్డును.. ఆంక్షల సమయంలో ప్రయాణ పాస్లుగా గుర్తించి అనుమతించాలని యూపీఎస్సీ పేర్కొంది. ప్రస్తుత కొవిడ్ పరిస్థితిని అంచనా వేసి.. అభ్యర్థులకు నష్టం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. పరీక్షల ప్రారంభానికి ముందు రోజు(జనవరి 6) నుంచి పరీక్షలు ముగిసేంతవరకు.. రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని కోరింది.
UPSC news today