జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బందిపొరా జిల్లాలో ఓ పౌరుడిపై కాల్పులకు(Militant Attack In Kashmir) తెగబడ్డారు. ఈ ఘటనలో పౌరుడు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి 8గంటల సమయంలో బొహ్రీ కదల్ ప్రాంతంలో మహమ్మద్ ఇబ్రహీంఖాన్‌పై కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇబ్రహీంను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇబ్రహీం.. మహారాజ్ఘంజ్ ప్రాంతంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.