బంగాల్ రాజధాని కోల్‌కతాలో అమానుష ఘటన వెలుగుచూసింది. బస్సులో చోరీకి పాల్పడాడనే ఆరోపణతో అనుమానితుడిని దారుణంగా కొట్టాడు ఓ సిటీ పోలీసు వలంటీరు. దక్షిణ మధ్య కోల్‌కతాలో ఆదివారం సాయంత్రం జరిగిందీ ఘటన.
ఇదీ జరిగింది
బస్సులో తన బ్యాగును ఓ వ్యక్తి దొంగిలించడానికి యత్నించాడని ఓ మహిళ ఆరోపించింది. దీంతో స్థానికులు.. అతనిని పట్టుకుని చితకబాదారు. అయితే సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు వలంటీర్ తన్మయ్ బిశ్వాస్.. ఆ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని మరింత దారుణంగా కొట్టాడు. కాలుతో ఛాతీపై తన్నాడు. అనంతరం దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ఆ పోలీసు వలంటీర్‌పై విమర్శలు గుప్పించారు. 2020లో అమెరికాలో ఓ పోలీసు అధికారి.. ఆఫ్రికన్ సంతతి వ్యక్తి అయిన జార్జ్ ఫ్లాయిడ్‌పై చేసిన జాత్యహంకార దాడిని గుర్తు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.