తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జనగణమన', 'వందేమాతరం'పై పిల్​.. రెండింటికీ సమాన హోదాపై కేంద్రం స్పందన

'జనగణమన' గీతం, 'వందేమాతరం' గేయానికి సమాన హోదా కల్పించాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్​పై కేంద్రం స్పందించింది. ఈ రెండింటికీ ఇప్పటికే సమాన హోదా ఉందని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలోని ప్రతి పౌరుడు ఈ రెండింటినీ సమానంగా గౌరవించాలని పేర్కొంది.

By

Published : Nov 5, 2022, 5:15 PM IST

Delhi High Court
దిల్లీ హైకోర్టు

'జనగణమన', 'వందేమాతరం' రెండింటికీ సమాన హోదా ఉందని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు దిల్లీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. జాతీయ గీతం 'జనగణమన'కి సమానమైన హోదాను 'వందేమాతరం' గేయానికి కూడా కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందిస్తూ ఈ మేరకు స్పష్టతనిచ్చింది. దేశంలోని ప్రతి పౌరుడు ఈ రెండింటికీ సమాన గౌరవం చూపాలని కేంద్రం కోరింది.

'జనగణమన', 'వందేమాతరం' గేయానికి సమాన గౌరవం, హోదా కల్పించేలా మార్గదర్శకాలను రూపొందించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో వందేమాతరం కీలక పాత్ర పోషించిందని పిటిషనర్ వాదించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వందేమాతరానికి కూడా జనగణమనతో సమానమైన గౌరవం ఇవ్వాలని పిటిషన్‌లో ఆయన కోరారు. అన్ని పాఠశాలలు, విద్యాసంస్థల్లో ప్రతిరోజూ వందేమాతరం, జనగణమన పాడేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విచారణలో భాగంగా.. ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని కేంద్ర హోం, విద్యా, సాంస్కృతిక, న్యాయ మంత్రిత్వ శాఖలకు దిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం సమాధానం ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details