TSPSC Paper Leak Case news: పేపర్ లీకేజీ కేసులో టీఎస్పీఎస్సీకి సిట్ నివేదిక ఇచ్చింది. రాజశేఖర్ టీఎస్‌పీఎస్సీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగని సిట్ తన నివేదిక పేర్కొంది. అతను కమిషన్ కార్యలయంలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తూ డేటాను చోరీ చేశాడని తెలిపింది. ఉద్దేశ పూర్వకంగానే రాజశేఖర్ టీఎస్‌పీఎస్సీకి వచ్చారన్న సిట్.. ప్రవీణ్‌తో రాజశేఖర్‌రెడ్డి సత్సంబంధాలు కొనసాగించడని చెప్పింది. అతను కంప్యూటర్ హ్యాక్ చేసి పాస్‌వర్డ్ దొంగిలించాడని తెలిపింది.
కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి పాస్‌వర్డ్ దొంగిలించారని, పాస్‌వర్డ్‌ను తాను ఎక్కడా రాయలేదని ఆమె చెప్పారని నివేదికలో పేర్కొంది. శంకరలక్ష్మి డైరీ నుంచి పాస్‌వర్డ్ దొంగిలించామని ప్రవీణ్ చెప్పాడు. పెన్‌డ్రైవ్‌లోకి రాజశేఖర్ 5 ప్రశ్నపత్రాలను కాపీ చేశాడని తెలిపింది. ప్రశ్నపత్రాలు కాపీ చేసిన పెన్‌డ్రైవ్‌ను రాజశేఖర్ ప్రవీణ్‌కు ఇచ్చాడని నివేదికలో పేర్కొంది. ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్ రేణుకకు అమ్మాడన్న సిట్.. గ్రూప్- 1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం కూడా లీకైనట్లు గుర్తించింది. ప్రవీణ్‌కు 103 మార్కులు రావడంపై విచారణ జరిపింది. గ్రూప్-1 ప్రిలిమ్స్, ఇతర ప్రశ్నపత్రాలు కొట్టేసినట్లు సిట్ నిర్ధారించింది.
సిట్ దర్యాప్తు ముమ్మరం: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఏఈ ప్రశ్నపత్రం మాత్రమే లీకైందని గుర్తించిన అధికారులు.. మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షను రద్దు చేసినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో ఏఈ ప్రశ్నపత్రాంతో పాటు వెటర్నరీ అసిస్టెంట్, టౌన్‌ప్లానింగ్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ ఎగ్జామ్‌కు సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్టు అధికారులు అనుమానించారు. ఈ మేరకు ప్రవీణ్ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు పెన్‌డ్రైవ్‌ను వారు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.