తెలంగాణ

telangana

ETV Bharat / bharat

CISF Head Constable Jobs 2023 : ఇంటర్​ అర్హతతో.. CISFలో 215 హెడ్​ కానిస్టేబుల్​ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా! - స్పోర్ట్ కోటా జాబ్స్ 2023

CISF Head Constable Jobs 2023 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న క్రీడాకారులకు గుడ్​ న్యూస్​. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్​ (CISF) స్పోర్ట్స్​ కోటాలో 215 హెడ్​ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు తదితర పూర్తి వివరాలు మీ కోసం.

CISF sports quota jobs 2023
CISF Head Constable Jobs 2023

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 11:04 AM IST

Updated : Oct 31, 2023, 11:37 AM IST

CISF Head Constable Jobs 2023 :సెంట్రల్​ ఇండస్ట్రియల్​ సెక్యూరిటీ ఫోర్స్​ (CISF) 215 హెడ్​ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. అథ్లెటిక్స్​, గేమ్స్​, స్పోర్ట్స్​లో మంచి ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ఇది ఒక సదావకాశం. ఆసక్తి గల అభ్యర్థులు సీఐఎస్​ఎఫ్ అధికారిక వెబ్​సైట్​ https://cisfrectt.cisf.gov.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలు
CISF Head Constable Job Qualifications :
ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి 10+2 (ఇంటర్​) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్టేట్​/ నేషనల్​/ ఇంటర్నేషనల్​ గేమ్స్​, స్పోర్ట్స్, అథ్లెటిక్స్​లో.. క్రీడాకారుడిగా పాల్గొని ఉండాలి. వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి ప్రాధాన్యత కూడా ఉంటుంది.

క్రీడాంశాలు
CISF Sports Quota Jobs :

  • అథ్లెటిక్స్​ : రన్నింగ్​, మారథాన్​, షాట్​ పుట్​, డిస్క్​ త్రో, హేమర్​ త్రో, జావెలిన్​ త్రో, లాంగ్​ జెంప్​, ట్రిపుల్​ జంప్​, డెకాథ్లాన్​
  • గేమ్స్ అండ్ స్పోర్ట్స్​ : బాక్సింగ్​, బాస్కెట్​ బాల్, ఫుట్​బాల్​, జిమ్నాస్టిక్స్​, హ్యాండ్​ బాల్​, హాకీ, షూటింగ్​, స్విమ్మింగ్​, వాలీబాల్​, వెయిట్​ లిఫ్టింగ్​, రెజ్లింగ్​, థైక్వాండో, బాడీ బిల్డింగ్​​

వయోపరిమితి
CISF Head Constable Age Limit :అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

అప్లికేషన్ ఫీజు
CISF Head Constable Fee :

  • యూఆర్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి.
  • మహిళలు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన పనిలేదు.

ఎంపిక ప్రక్రియ
CISF Head Constable Selection Process :అభ్యర్థులకు ట్రయల్​ టెస్ట్​, ప్రొఫీషియన్సీ టెస్ట్​, ఫిజికల్ స్టాండర్డ్​ టెస్ట్​, డాక్యుమెంట్ వెరిఫికేషన్​ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇందులో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులను హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
CISF Head Constable Salary :హెడ్​ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు జీతం ఇస్తారు.

దరఖాస్తు విధానం
CISF Head Constable Application Process :

  • అభ్యర్థులు ముందుగా సీఐఎస్​ఎఫ్ అధికారిక వెబ్​సైట్​ https://cisfrectt.cisf.gov.in/ ఓపెన్ చేసి, లాగిన్​ కావాలి.
  • CISF Head Constable Recruitment 2023 లింక్​పై క్లిక్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు, క్రీడానైపుణ్యాలకు సంబంధించిన అంశాలను నమోదు చేయాలి.
  • ఆన్​లైన్​లోనే దరఖాస్తు రుసుము కూడా చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి సరిచూసుకొని అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్​ ప్రింట్​అవుట్​ తీసుకుని భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
CISF Head Constable Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 అక్టోబర్​ 30
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 నవంబర్​ 28

PGCIL Engineer Trainee Jobs : పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​లో 184 ఇంజినీర్ ట్రైనీ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

RCFL Apprentice Jobs 2023 : డిగ్రీ, డిప్లొమా అర్హతతో.. RCFLలో 408 అప్రెంటీస్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!

SSB Constable Jobs 2023 : పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరి తేదీ ఎప్పుడంటే?

Last Updated : Oct 31, 2023, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details