ఓటు వేయడానికి తరలివచ్చిన సినీతారలు- రాజ్యాంగహక్కును వినియోగించుకోవాలని పిలుపు Cine Actors Cast their Vote in Telangana :రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో(TS Elections 2023) టాలీవుడ్ సినీప్రముఖులు.. తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ క్లబ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి ఓటు వేశారు. మణికొండలో హీరో వెంకటేష్, జూబ్లీహిల్స్ ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో.. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్‌లో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ఓటేశారు.
మా బాధ్యతగా మేం ఓటు వేశాం - మరి మీరూ?
Telangana Assembly Elections 2023 :జూబ్లీహిల్స్ క్లబ్‌లో సినీనటుడు సుమంత్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో.. సంగీత దర్శకుడు కీరవాణి ఓటుహక్కు వినియోగించుకున్నారు. షేక్ పేటలో సినీ దర్శకుడు రాజమౌళి ఆయన సతీమణి రమా రాజమౌళి, ఫిల్మ్‌నగర్ క్లబ్‌లో దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు దగ్గుబాటి రానా తమ ఓటేశారు.
Tollywood Celebrities Casting Vote :జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో హీరో మహేష్‌బాబు, ఆయన సతీమణి నమ్రత ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే పోలింగ్ బూత్‌లో సినీ నటులు జీవిత, రాజశేఖర్‌లు ఓటేశారు. జూబ్లీహిల్స్ క్లబ్‌లో రామ్‌చరణ్ ఆయన సతీమణి ఉపాసన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటులు నాగార్జున, అమల, నాగచైతన్య.. జూబ్లీహిల్స్‌లోని ప్రభుత్వ వర్కింగ్ విమెన్ హాస్టల్ పోలింగ్ బూత్‌లో ఓటేశారు.
బంజారాహిల్స్ పోలింగ్ బూత్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్ ఓటేశారు. గచ్చిబౌలి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నాని ఓటేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో హీరో విజయ్ దేవరకొండ కుటుంబసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
సిరా చుక్కతో సీఎం కేసీఆర్ ఫ్యామిలీ - ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే?
హీరో రవితేజ, జగపతిబాబు జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఓటేశారు. జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నందమూరి బాలకృష్ణ కుమారుడు.. మోక్షజ్ఞ ఓటు వేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో మంచులక్ష్మి, మంచు మనోజ్ ఓటేశారు. సరస్వతి విద్యా మందిర్ స్కూల్‌లో నటుడు ప్రియదర్శి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలింగ్ బూత్‌లో నిర్మాత బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.
హస్యనటుడు బ్రహ్మనందం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు చమత్కరిస్తూ.. నవ్వులు పూయించారు. నటులు సాయిధరమ్ తేజ్, గోపిచంద్, మంచు మనోజ్, అనసూయ, ప్రియదర్శి, ఆది, తదితరులు ఓటు వేశారు. సినీ నిర్మాత అల్లు అరవింద్, ఎస్కేఎన్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
విధులతో పాటు బాధ్యతనూ నిర్వర్తిస్తాం - ఓటెత్తిన ప్రభుత్వాధికారులు