తెలంగాణ

telangana

ETV Bharat / bharat

CID Officers Call Data Record Case: సీఐడీ అధికారుల కాల్‍డేటా ఇవ్వాలన్న పిటిషన్‍పై విచారణ ఈనెల 18కి వాయిదా - చంద్రబాబు అరెస్టు

CID Officers Call Data Record Case: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు, ఆ సమయంలో, ఆ తర్వాత సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డులు ఇవ్వాలని కోరుతూ.. చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 18వ తేదీకి విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.

CID Officers Call Data Record Case
CID Officers Call Data Record Case

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 1:50 PM IST

CID Officers Call Data Record Case: విజయవాడ ఏసీబీ కోర్టులో కాల్‌ డాటా రికార్డు పిటిషన్‌పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు వేసిన కేసులో విచారణను ఈనెల 18కి వాయిదా వేశారు. చంద్రబాబు అరెస్టుకు ముందు, ఆ సమయంలో, ఆ తర్వాత సీఐడీ అధికారులు ఎవరెవరితో మాట్లాడారో కాల్‌డేటాను తమకివ్వాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో నెల రోజుల క్రితం పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై నిన్న ఏసీబీ కోర్టు జరిపిన విచారణ సమయంలో ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పరస్పరం కేకలు వేసుకుంటూ వాదించుకోవడంతో న్యాయాధికారి హిమబిందు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Chandrababu's health in jail : జైలులో చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన

అంతకు ముందు సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డులు ఇవ్వాలన్న పిటిషన్‌పై చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. గత నెల 8వ తేదీన రాత్రి పది గంటలకు చంద్రబాబును అరెస్టు చేశారని.. అరెస్ట్ అనంతరం 24 గంటలపాటు నిర్భంధంలో ఉంచారని గుర్తు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారని.. అయితే చంద్రబాబు నాయుడిను దర్యాప్తు అధికారి కాకుండా పర్యవేక్షకాధికారి అరెస్టు చేశారు.

దర్యాప్తు అధికారి కాకుండా ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఎవరిది ఉందో, వారి కాల్‌డేటా మొత్తం కోర్టుకు తెప్పించి భద్రపరచాలని చంద్రబాబు తరుఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై కాల్‌డేటా పిటిషన్‌కు విచారణ అర్హత లేదని, దర్యాప్తు అధికారుల వ్యక్తిగత గోప్యతకు ఇబ్బంది కలుగుతుందని సీఐడీ తరపు న్యాయవాది తెలిపారు. కాల్‌డేటా ఇవ్వాలంటూ సీఆర్‌పీసీలో ఏ సెక్షన్లు లేవని.. దర్యాప్తు అధికారి తీసుకొచ్చిన రిమాండ్‌ రిపోర్టును పరిశీలించిన తరువాతే జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారని వాదనలు వినిపించారు.

Anticipatory Bail for Chandrababu in Angallu Case: అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు

ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు, సీఐడీ న్యాయవాది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తాను వాదనలు వినలేనంటూ బెంచ్‌ దిగి న్యాయాధికారి హిమబిందు తన ఛాంబర్‌లోకి వెళ్లిపోయారు. ఏసీబీ కోర్టులో జరిగిన పరిణామాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసు దర్యాప్తు అధికారుల కాల్ డేటా రికార్డు పిటిషన్​పై విచారణ సమయంలో సీఐడీ, చంద్రబాబు న్యాయవాదుల మధ్య వివాదం నెలకొన్న సమయంలో జరిగిన వాగ్వాదాలు, ప్రస్తావనకు వచ్చిన అంశాలు ఇతర వ్యాఖ్యల వివరాలను ఉటంకిస్తూ ఇద్దరు న్యాయవాదుల పేర్లనూ ప్రస్తావిస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి లేఖ రాసినట్లు సమాచారం. ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డుల పిటిషన్‌పై విచారణ సందర్భంగా గ్యాగ్‌ ఆర్డర్‌ పదం తీవ్ర దుమారానికి దారితీసింది.

ACB Court Judge Serious on Both Sides Lawyers: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు.. ఇరుపక్షాల న్యాయవాదులపై న్యాయాధికారి తీవ్ర అసహనం

ABOUT THE AUTHOR

...view details