తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 5:08 PM IST

Updated : Nov 2, 2023, 6:55 PM IST

ETV Bharat / bharat

ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయని చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ

CID registered another
CID registered another

17:04 November 02

తెలుగుదేశం హయాంలో ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు

CID Registered Another Case Against Chandrababu: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. టీడీపీ హయాంలో ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయంటూ.. ఏపీఎండీసీ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా వ్యవహరించారంటూ.. వెంకటరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పీతల సుజాత, చంద్రబాబు, చింతమనేని ప్రభాకర్‌, దేవినేని ఉమ పేర్లు ఉన్నాయి.

చంద్రబాబుపై సీఐడీ (CID) అధికారులు ఇటీవలే ఓ కేసు నమోదు చేశారు. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కంపెనీలకు అనుమితిని ఇచ్చారని ఫిర్యాదు అందటంతో కేసు నమోదు చేసిన్నట్లు సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్​లో తెలిపారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్​ కాపీని సీఐడీ కోర్టు జడ్జికి అందించారు.

కేసుల పరంపరపై ప్రజల ఆగ్రహం: చంద్రబాబుపై సీఐడీ (CID) అధికారులు కేసుల పరంపర కొనసాగిస్తున్నారు. నిన్నమెున్నటి వరకూ... స్కిల్ కేసులో అక్రమాలు జరిగాయంటూ... విచారణ పేరుతో జైల్లో పెట్టిన అధికారులు.. చంద్రబాబుకు బెయిల్ వస్తుందనే సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ కొత్త కేసును తెరపైకి తెచ్చారు. నేడు ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ... కేసు నమోదు చేశారు. ఇప్పటివరకూ... చంద్రబాబుపై స్కిల్ డెవలప్ మెంట్, ఫైబర్ నెట్, రింగ్ రోడ్డు, మద్యం కంపెనీలకు అనుమతలు, ఇసుక పాలసీలో అవకతవకలు... అంటూ వివిధ ఆరోపణలతో చంద్రబాబుపై కేసులు నమోదు చేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వేల కోట్లు దోచుకున్న వ్యక్తిని వదిలి... నిజాయితీగా ప్రజల కోసం పని చేసిన చంద్రబాబుపై కేసులు పెడుతున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Nov 2, 2023, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details