తెలంగాణ

telangana

ETV Bharat / bharat

CID Sanjay AAG Ponnvolu : కృష్ణా, గంగా నదులు... నాసిక్‌లో పుట్టాయంట! సీఐడీ చీఫ్, ఏఏజీలు చెప్పారు..! పిల్లలూ నిజమేనా...?

CID Sanjay AAG Ponnvolu : గంగా నది నాసిక్‌లో పుట్టిందన్న ఏఏజీ... కాదు.. కాదు.. అక్కడ పుట్టింది కృష్ణా అని చెప్పారు సీఐడీ చీఫ్‌ సంజయ్. స్కిల్ డెవలప్​మెంట్ కేసుపై హైదరాబాద్​లో ప్రెస్​మీట్ పెట్టిన వీరిద్దరూ.. కేసు వివరాలను వెల్లడించే క్రమంలో తమ జ్ఞానాన్ని ఇలా చాటుకున్నారు. అర్థం లేని పోలిక.. అవసరం లేని అలంకారాలు తగిలించే ప్రయత్నంలో అడ్డంగా బుక్కయ్యారు.

cid_sanjay_aag_ponnvolu1
cid_sanjay_aag_ponnvolu1

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 12:37 PM IST

Updated : Sep 15, 2023, 4:03 PM IST

CID Sanjay AAG Ponnvolu : దంపతులిద్దరూ భోజనం చేస్తున్న సమయంలో కరెంటు పోయింది.. వెంటనే పక్కనున్న కూతురు క్యాండిల్ వెలిగించింది. 'ఏమేవ్.. ఉక్కపోస్తోంది.. కాస్త ఫ్యాన్ వేయొచ్చుగా' అన్నాడు ఆయన.. ' మీరు భలే ఉన్నారే.. ఫ్యాన్ వేస్తే క్యాండిల్ ఆరిపోతుంది' అని సమాధానమిచ్చింది ఆవిడ. ఇదంతా ఎందుకంటే..! సరిగ్గా ఇలాంటి సందర్భమే ఎదురైంది హైదరాబాద్​లో మీడియా ప్రతినిధులకు.

CID Sanjay AAG Ponnvolu : కృష్ణా, గంగా నదులు... నాసిక్‌లో పుట్టాయంట! సీఐడీ చీఫ్, ఏఏజీలు చెప్పారు..! పిల్లలూ నిజమేనా...?

CID Chief Sanjay Comments on Chandrababu Case: 'ప్రైవేటు వ్యక్తికి పదవులు..' చంద్రబాబు కేసుపై సీఐడీ చీఫ్ ఏమన్నారంటే..!

ఏపీకి చెందిన సీనియర్‌ ఐపీఎస్‌, సీఐడీ(CID) చీఫ్‌ సంజయ్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (AAG) పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టారు. ఎఫ్ఐఆర్​ (FIR)లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్టు చేసిన స్కిల్‌ డెవలప్​మెంట్ కేసు (skill development case) లో ఇప్పుడు వీరిద్దరి పేర్లు మార్మోగుతున్నాయి. కేసు దర్యాప్తు ఒకరు, కోర్టులో విచారణ మరొకరు ముందుకు నడిపిస్తున్నారు. ఈ నేపథ్యాన కేసు గురించి తెలంగాణకు సంబంధం లేకున్నా.. అక్కడ వివరించే లక్ష్యంతో గురువారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టారు. అక్కడే... తమ ‘జనరల్‌ నాలెడ్జ్‌’ ఎంత గొప్పగా ఉందో చాటుకునేందుకు విఫలయత్నం చేశారు.

TDP Released Statement on CID Allegations in Skill Development Case: సీఐడీ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన టీడీపీ

స్కిల్ డెవలప్​మెంట్​ కేసు పుణెలో ప్రారంభమైందని సూటిగా చెబితే సరిపోయేది.. కానీ, నాటకీయత జోడించే క్రమంలో పిల్లిమొగ్గలు వేశారు.' గంగా నది ఎక్కడ పుట్టిందో ఈ కేసు కూడా అక్కడే పుట్టింది... గంగ నాసిక్‌లో పుట్టినట్లు.. ఈ కేసుకు పుణె నాసిక్‌ పాయింట్‌ లాంటిది. గంగా నది నాసిక్‌ నుంచి ప్రవహిస్తూ.. బోటమ్‌ పాయింట్‌కు చేరినట్లు... ఈ కేసు చివరికి ఆంధ్రప్రదేశ్‌కు చేరింది' అని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు వివరించారు. ‘గంగా (Ganga) నది నాసిక్‌లో పుట్టింది’ అని ఏఏజీ అనగానే... పక్కనే ఉన్న సంజయ్‌.. 'అక్కడ పుట్టింది గంగ కాదు.. కృష్ణా (Krishna) నది' అని ‘సవరించారు. మైక్‌ను చేతితో మూసేసి ‘కృష్ణా.. కృష్ణా..’ అంటూ చిన్నగా చెప్పినా ఏఏజీ అది కూడా వినిపించుకోలేదు. ‘గంగా నది నాసిక్‌లో పుట్టింది’ అంటూ మళ్లీ మళ్లీ చెప్పారు. అసలు విషయం ఏమిటంటే... నాసిక్‌లో పుట్టింది గంగా కాదూ, కృష్ణా నదీ కాదు... మహారాష్ట్రలోని నాసిక్‌ సమీపంలోని త్రయంబకంలో గోదావరి నది ఉద్భవించిందనే విషయం స్కూలు పిల్లలకు కూడా తెలుసు. గంగ పుట్టింది హిమాలయాల్లోని గంగోత్రి (Gangotri)లో! కృష్ణా నది జన్మస్థానం మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో ఉన్న మహాబలేశ్వరం! ఇదీ అసలు విషయం! కానీ... కేసులో తాము చెప్పిందే నమ్మాలంటున్నట్లు.. గంగ నాసిక్‌లో పుట్టిందన్నా నమ్మాలంటారేమో! కాదు అని ఎవరైనా అడ్డుచెప్పే ప్రయత్నం చేసినా కేసు పెట్టి లోపలేస్తారేమో..!

CID Investigation in Chandrababu Case: అంతా స్క్రిప్ట్​ ప్రకారమే.. ఎంచుకున్న వారిపైనే కేసులు, అరెస్టులు

Last Updated : Sep 15, 2023, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details