తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

దేశంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అర్ధరాత్రి నుంచే చర్చిలలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో దిల్లీలోని పలు ప్రాంతాల్లో చర్చిలను మూసివేశారు. మహారాష్ట్రలోనూ ఆంక్షల మధ్యే క్రిస్మస్ వేడుకలు జరిగాయి.

CHRISTMAS INDIA
CHRISTMAS INDIA

By

Published : Dec 25, 2021, 7:45 AM IST

దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. చర్చిలన్నీ పండగ కళను సంతరించుకున్నాయి. భక్తులంతా అర్ధరాత్రి నుంచే వేడుకల్లో పాల్గొన్నారు.

కర్ణాటక బెంగళూరులోని సెయింట్ ఫ్రాన్సిస్ చర్చిలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.

బెంగళూరు సెయింట్ ఫ్రాన్సిస్ చర్చిలో ప్రార్థనలు
బెంగళూరు సెయింట్ ఫ్రాన్సిస్ చర్చిలో

పుదుచ్చేరిలో పెద్ద ఎత్తున భక్తులు అర్ధరాత్రి నుంచే చర్చిలకు విచ్చేశారు.

పుదుచ్చేరి: విద్యుత్ దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్న చర్చి

హిమాచల్​ప్రదేశ్​లో స్థానికులతో పాటు విదేశీ పౌరులు సైతం చర్చిలలో ప్రార్థనలు చేశారు. ధర్మశాలలోని వైల్డర్​నెస్ చర్చిలో బెల్జియం దౌత్యవేత్త ప్రార్థనలు చేశారు. 'ఇంటి నుంచి దూరంగా ఉన్న తమకు.. ఇక్కడి క్రైస్తవులతో కలిసి క్రిస్మస్ నిర్వహించుకోవడం సంతోషంగా ఉంద'ని ఆయన పేర్కొన్నారు.

హిమాచల్​ప్రదేశ్​ ధర్మశాలలో..
ధర్మశాలలోని చర్చిలో విదేశీయులు
బెల్జియం దౌత్యవేత్త

దిల్లీలో మాత్రం క్రిస్మస్ వేడుకలపై కరోనా ప్రభావం పడింది. ఆంక్షల నేపథ్యంలో చర్చిలలోకి ఎవరినీ అనుమతించలేదు. చాందినీ చౌక్​లోని బాప్టిస్ట్ చర్చి, గోల్ మార్కెట్​లోని సేక్రడ్ హార్ట్ కేథడ్రల్ చర్చిలను మూసేశారు. అయితే, కొంతమంది భక్తులు చర్చి బయట ప్రార్థనలు చేసుకున్నారు.

దిల్లీలోని బాప్టిస్ట్ చర్చి
దిల్లీలో చర్చి బయటే భక్తులు
శాంటాక్లాజ్ వేషధారణలో చిన్నారి
దిల్లీలో చర్చి బయట రోడ్డుపై...

మహారాష్ట్రలోనూ ఆంక్షల మధ్య క్రిస్మస్ వేడుకలు జరిగాయి. చర్చిల సామర్థ్యంలో 50శాతం వరకే అనుమతించాలని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో.. పరిమిత సంఖ్యలోనే భక్తులు హాజరయ్యారు.

సెయింట్ మైఖెల్స్ చర్చిలో..
సెయింట్ మైఖెల్స్ చర్చి గేటు వద్దే ప్రార్థనలు చేస్తున్న భక్తురాలు

బంగాల్​లో సామూహిక ప్రార్థనలు జరిగాయి. కోల్​కతాలోని సెయింట్ థెరిసా చర్చిలో నిర్వహించిన ప్రార్థనలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

ఇదీ చదవండి:క్రిస్​మస్​ ప్రయాణాలపై ఒమిక్రాన్​ దెబ్బ.. వందల విమానాలు రద్దు

ABOUT THE AUTHOR

...view details