తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్కూల్​ టాయిలెట్​లో విద్యార్థినిపై అత్యాచారం.. కొరియోగ్రాఫర్​ అరెస్ట్ - rajastan minor raped

Minor raped: రాజస్థాన్​లో మైనర్​పై అత్యాచారం చేశాడు ఓ కొరియోగ్రాఫర్. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Choreographer arrested from Delhi
Choreographer arrested from Delhi

By

Published : Mar 26, 2022, 5:50 AM IST

Minor raped: రాజస్థాన్​ జోధ్​పుర్​లో స్కూల్ టాయిలెట్​లోనే విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కొరియోగ్రాఫర్. అయితే ఈ ఘటన నాలుగేళ్ల క్రితం జరిగింది. కల్చరల్ ఫెస్ట్​లో భాగంగా విద్యార్థులకు నృత్యం నేర్పించడానికి వచ్చిన కొరియోగ్రాఫర్ సనమ్​ గిల్​(23) పాఠశాల ఆవరణలోని టాయిలెట్​లో విద్యార్థిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సమయంలో బాలిక వయసు ఐదేళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు.

ఇటీవల విద్యార్థి తల్లి.. 'గుడ్ టచ్ బ్యాడ్ టచ్' పై అవగాహన కల్పిస్తుండగా.. బాలికకు ఈ ఘటన గుర్తొచ్చి తల్లికి చెప్పింది. షాక్​కు గురైన తల్లి బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లి.. సోనోగ్రఫీ పరీక్ష చేయించగా నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో జోధ్​పుర్​ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి:అందుకు అడ్డొస్తున్నాడని.. కుమారుడిని హతమార్చిన తల్లి

ABOUT THE AUTHOR

...view details