మహారాష్ట్ర.. జల్గావ్ జిల్లాలో ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఓ పైలట్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
హెలికాప్టర్.. జల్గావ్ జిల్లా చోప్డా మండలంలోని వార్దీ గ్రామం వద్ద కుప్పకూలిందని పశువుల కాపరులు.. తమకు సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.