Chirutha Attack on Girl: తిరుమల కాలినడక మార్గంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఓ చిన్నారి చిరుత దాడికి బలై ప్రాణాలు కోల్పోయింది. దైవదర్శనానికని బయల్దేరిన కుటుంబంలో చిన్నారి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రుల అక్రందనలు ఆకాశన్నంటాయి.
బాధితులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం నుంచి దినేష్, శశికళల కుటుంబం దైవ దైర్శనానికని తిరుమలకు బయల్దేరింది. శుక్రవారం రాత్రి తిరుపతి చేరుకున్న తర్వాత.. 8 గంటల సమయంలో వారు అలిపిరి కాలినడక మార్గం ద్వారా కొండపైకి బయల్దేరారు. ఈ క్రమంలో వారు రాత్రి 11 గంటల సమయం వరకు లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు.
Cheetah Attack Boy Discharge: చిరుత దాడిలో గాయపడిన బాలుడు డిశ్చార్జ్
లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్న కొద్దిసేపటికే అక్కడ ఓ చిరుత.. కాలినడకన కొండపైకి వెళ్తున్న కుటుంబంపై దాడి చేసింది. ఈ దాడిలో ముందుగా నడిచి వెళ్తున్న లక్షిత అనే 6 సంవత్సరాల బాలికపై దాడి చేసి అడవిలోకి లాక్కెల్లింది. ఇంకో గంట సమయమైతే కొండపైకి చేరుకుంటారనే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిరుత దాడితో కుటుంబసభ్యులు భయంతో కేకలు వేశారు. అప్రమత్తమైన అక్కడి వారు చిరుతను వెంబడించేందుకు ప్రయత్నించారు.
చిరుత చిన్నారిని అడవిలోకి లాక్కెల్లాటంతో తల్లిదండ్రులు భద్రత సిబ్బందికి ఫిర్యాదు చేశారు. రాత్రి సమయం కావటంతో గాలింపు చర్యలు చేపట్టటానికి సిబ్బందికి సాధ్యం కాలేదు. శనివారం ఉదయం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టటంతో.. ఆలయానికి కొద్ది దూరంలోనే చిన్నారి మృతదేహం లభ్యమైంది. చిన్నారి మృతదేహన్ని చిరుత సగం తినేసిన ఘటనను చూసి.. అక్కడి భక్తులు ఆందోళనకు గురయ్యారు.
Cheetah Attack on Kid: తిరుమలలో బాలుడిపై చిరుత దాడి.. పరిస్థితి విషమం
పోలీసులు చిన్నారి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని రూయా ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారిపై దాడి చేసింది.. చిరుతన లేక ఎలుగుబంటి అనేది మొదటగా స్పష్టత రాలేదు. పోస్టుమార్టం నిమిత్తం నిర్వహించిన వైద్యులు చిన్నారిపై దాడి చేసింది చిరుతనే అని నిర్ధారించారు. అనంతరం పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో కుటుంబసభ్యలు మృతదేహన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
స్పందించిన టీడీపీ అధినేత:చిరుత దాడిలోచిన్నారి మరణించటంపై టీడీపీ అధినేత స్పందించారు. అలిపిరి మార్గంలో చిన్నారి మృతి అత్యంత విషాదకరమని విచారం వ్యక్తం చేశారు. కళ్లముందే కన్న కుమార్తెను క్రూర జంతువు లాక్కెళ్లితే ఆ బాధ వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కొద్దిరోజుల క్రితం చిరుత దాడిలో బాలుడు గాయపడ్డాడని.. టీటీడీ మరిన్ని రక్షణ చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం తప్పేదని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.
CHEETAH IN GHAT ROAD: తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం.. ఇద్దరికి గాయాలు