శ్రీలంకలో చైనా చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు భారత్కు ముప్పు కలిగించవచ్చని నావికాదళం పేర్కొంది. చైనా కార్యకలాపాలను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఈ మేరకు ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత నావికాదళ వైస్ చీఫ్, వైస్ అడ్మిరల్ జి.అశోక్ కుమార్ తెలిపారు. భారత తీరప్రాంత సరిహద్దులను రక్షించటంలో నౌకాదళం సర్వసన్నద్ధంగా ఉందన్న ఆయన.. ఎవరూ కూడా ఈ మార్గాల్లో అలజడి సృష్టించలేరని పేర్కొన్నారు.
"శ్రీలంకలో చైనా చేపడుతున్న ప్రాజెక్టులు.. భారత్కు ముప్పా? కాదా? అనేది కష్టతరమైన ప్రశ్నే. ఈ ప్రాంతానికి చెందని వారు ఇక్కడ అధిక ఆసక్తి చూపిస్తున్నారంటే.. కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి.. భారత్కు చైనా చర్యలు ముప్పు కలిగించవచ్చు. అందుకే మనం ఈ ప్రాంతాన్ని నిశితంగా గమనిస్తూ ఉండాలి."
-జి.అశోక్ కుమార్, నేవీ వైస్ చీఫ్