బంగ్లాదేశ్ సరిహద్దుల మీదుగా భారత భూభాగంలోకి ప్రవేశించిన ఓ 35 ఏళ్ల చైనా దేశస్థుడిని సరిహద్దు భద్రత దళాలు గురువారం అరెస్టు చేశాయి. ఈ ఘటన బంగాల్లోని మాల్దా జిల్లాలో జరిగింది.
చైనాకు చెందిన జూవైన్ హన్ను.. ఉదయం సుమారు 7 గంటలకు సరిహద్దు దాటుతుండగా గుర్తించామని అధికారులు వెల్లడించారు. సరిహద్దు దాటి రావడంపై అతను ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడం వల్ల అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నామని చెప్పారు. అతని నుంచి ల్యాప్‌టాప్, బంగ్లాదేశ్ వీసా ఉన్న చైనా పాస్‌పోర్ట్, మూడు సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
బంగ్లాదేశీ అరెస్ట్..
అంతకుముందు సరిహద్దు దళాలు.. భారత్‌లో నివసిస్తూ మానవ అక్రమ రవాణా చేస్తున్న బంగ్లాదేశీని అరెస్టు చేశాయి. అతడిని ఘోజదాంగ చెక్‌పోస్ట్‌కు తరలించి దర్యాప్తు చేపట్టాయి. నిందితుడి నుంచి 2 మొబైల్ ఫోన్స్, భారతీయ సిమ్‌కార్డులు, ఐదు బంగ్లాదేశీ సిమ్‌కార్డులు సహా వివిధ నకిలీ ఆధార్ కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు హస్సన్ ఘోజీ (28) బంగ్లాదేశ్‌లోని సాత్ఖిరా జిల్లాకు చెందిన వాడని దర్యాప్తులో తెలిసింది. అక్రమంగా భారత్‌లోకి చొరబడి గత 20 ఏళ్లగా భారత్‌లోనే నివసిస్తున్నట్లు.. ఇటీవల 25 ఏళ్ల భారతీయురాలిని కూడా వివాహం చేసుకున్నట్లు నిందితుడు వెల్లడించాడు.
ఇదీ చదవండి :వింత ప్రేమకథ- పదేళ్లుగా ఒకే గదిలో యువతి