యార్లుంగ్-సాంగ్‌పొ నదిపై చైనా తలపెట్టిన ఆనకట్టతో భారత్‌కు ప్రమాదం పొంచి ఉందని నదీజలాల ఇంజినీరింగ్ నిపుణులు ఈటీవీ భారత్‌తో వెల్లడించారు. అన్ని వర్గాలు లబ్ధిపొందాలంటే కలిసి పనిచేయడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు.
చైనాలోని యార్లుంగ్-సాంగ్‌పొ నది.. భారత్‌లోని అసోంలో బ్రహ్మపుత్రగా, బంగ్లాదేశ్‌లో పద్మగా ప్రవహిస్తుంది. దీనిపై చైనా ఓ ఆనకట్టను నిర్మిస్తోంది. అయితే ఇందులో భారత్-బంగ్లాదేశ్‌ను వాటాదారులుగా చైనా చేర్చాలని అభిప్రాయపడ్డారు ఐఐటీ రూర్కీ అధ్యాపకులు, 45ఏళ్లుగా వివిధ నదీజలాల ఇంజినీరింగ్ ప్రాజెక్ట్‌లో పని చేసిన ప్రొఫెసర్ నయన్ శర్మ.
"నేను ఈ నదికి సంబంధించి పనుల్లో పని చేశాను. చైనా నిర్ణయంతో భారత్-బంగ్లాదేశ్‌కు ముప్పుపొంచి ఉంది. ముఖ్యంగా భద్రత, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానంపై సమస్యలున్నాయి. ముందుకెళ్లాలని చైనా నిర్ణయించుకుంటే.. భారత్-బంగ్లాదేశ్‌ను ప్రధాన వాటాదారులుగా చేర్చుకోవాలి. అప్పుడే ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు."