తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనాపై దలైలామా తీవ్ర విమర్శలు- బీజింగ్ కౌంటర్ - దలైలామా టిబెట్ తాజా వార్తలు

చైనా నాయకత్వంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా(Dalai Lama Latest News) మరోమారు విమర్శలు గుప్పించారు. చైనాలో హాన్‌ వర్గం ఆధిపత్యమే ఎక్కువగా ఉందన్నారు. అత్యంత సంకుచిత మనస్తత్వం కలిగిన చైనా నాయకులు.. టిబెట్​ ప్రజలు, సంస్కృతిని అర్ధం చేసుకోలేరని వ్యాఖ్యానించారు. తాను భారత్​లోనే ఉంటానని.. ఇక్కడే ప్రశాంతంగా ఉందన్నారు.

Dalai Lama
దలైలామా

By

Published : Nov 10, 2021, 7:06 PM IST

బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా(Dalai Lama Latest News) (86) చైనా నాయకత్వాన్ని మరోసారి విమర్శించారు. భిన్న సంప్రదాయాల ప్రాముఖ్యాన్ని వారు అర్థం చేసుకోలేరని విమర్శించారు. ముఖ్యంగా అక్కడి హాన్‌ వర్గ ఆధిపత్యం, నియంత్రణే ఎక్కువ ఉందని వ్యాఖ్యానించారు. అయితే, తోటి వ్యక్తిగా తనకు చైనా ప్రజలపై ఎటువంటి వ్యతిరేకత లేదన్నారు. కమ్యూనిజం, మార్క్సిజం భావాలకు తాను అనుకూలమన్న విషయాన్ని గుర్తుచేశారు.

టోక్యో వేదికగా ఆన్‌లైన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆధ్యాత్మిక గురువు దలైలామా(Dalai Lama Latest News). జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా భారత్‌లోనే ఉంటానన్న ఆయన.. ఇక్కడే ప్రశాంతంగా ఉందని వెల్లడించారు.

చైనా అర్థం చేసుకోలేదు..

"మావో జెడాంగ్‌ నుంచి కమ్యూనిస్టు పార్టీ నేతల గురించి నాకు తెలుసు. వారి ఆలోచనలు మంచివే. కానీ, కొన్నిసార్లు అత్యంత కఠినంగా నియంత్రణలు ఉంటాయి. అయితే, నేటి తరం నేతల ఆలోచనల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నా."

-- దలైలామా, ఆధ్యాత్మిక గురువు

"టిబెట్‌, షిన్‌జియాంగ్‌ విషయానికొస్తే.. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక సంస్కృతి ఉంది. కాబట్టి అత్యంత సంకుచిత మనస్తత్వం కలిగిన చైనా నాయకులు ఇక్కడి ప్రత్యేక సంస్కృతులను అర్థం చేసుకోలేరు. చైనాలో హాన్‌ జాతికి చెందిన వారే కాకుండా భిన్న జాతులు, ఇతర వర్గాల ప్రజలు ఉన్నారు.. కానీ, హాన్‌ వర్గం ఆధిపత్యం, వారి నియంత్రణే అధికంగా ఉంటుందన్న మాట వాస్తవం" అని దలైలామా స్పష్టం చేశారు.

కమ్యూనిస్టు పార్టీలో చేరాలని..

ఆన్‌లైన్‌ వేదికగా జరిగిన ఈ సమావేశంలో జర్నలిస్టులు పలు అంతర్జాతీయ అంశాలతోపాటు చైనాకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. వీటికి సమాధానమిచ్చిన దలైలామా.. కమ్యూనిజం, మార్క్సిజం ఆలోచనలకు అనుకూలమన్న విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా ఒకసారి ఏకంగా కమ్యూనిస్టు పార్టీలోనే చేరాలనే ఆలోచన వచ్చిందని దలైలామా పేర్కొన్నారు. అప్పటి సంఘటనను నవ్వూతూ వివరించిన ఆయన.. ఇందుకు ఓ మిత్రుడు అభ్యంతరం చెప్పటం వల్ల ఆ ఆలోచనను విరమించుకున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇక తైవాన్‌పైనా ఆయన స్పందించారు. చైనా నుంచి తైవాన్‌ ఆర్థికంగా ఎంతో సహాయం పొందుతున్న మాట వాస్తవమన్నారు. కానీ, బౌద్ధ మతం, చైనా సంస్కృతి విషయానికొస్తే తైవానీయుల నుంచి చైనా ప్రజలు ఎంతో నేర్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

భారత్‌లోనే ఉంటా..

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కలిసే ఆలోచన లేదని దలైలామా స్పష్టం చేశారు. కానీ, వయసు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడున్న తన మిత్రులను కలవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే.. చైనా-తైవాన్‌ మధ్య సంబంధాలు కాస్త సున్నితంగా మారినందున తైవాన్‌కు మాత్రం వెళ్లకపోవచ్చని పేర్కొన్నారు.

ఇక భారత్‌లోనే ప్రశాంతంగా ఉంటానన్న దలైలామా.. మతసామరస్యానికి భారత్‌ కేంద్రబిందువని కొనియాడారు. అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, కేవలం రాజకీయ నాయకులతోనే అసలు సమస్య అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మతాన్ని కూడా రాజకీయం చేశారని.. ఇప్పుడు అదే ప్రధాన సమస్య అని దలైలామా(Dalai Lama Latest News) ఆవేదన వ్యక్తం చేశారు.

చర్చలకు సిద్ధం..

ఆధ్యాత్మిక గురువు దలైలామా వ్యాఖ్యలపై చైనా ప్రభుత్వం స్పందించింది. భవిష్యత్తు కార్యాచరణపై దలైలామాతో చర్చలకు తాము సిద్ధమేనని స్పష్టం చేసింది. అయితే టిబెట్​కు సంబంధించిన సమస్యలైతే చర్చలు జరపమని తెలిపింది.

ఇదీ చూడండి:'ధరల మంట'పై కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details