రెండు దశాబ్దాల పాటు అఫ్గానిస్థాన్ పునర్నిర్మాణంలో భారత్ అత్యంత కీలక పాత్ర పోషించింది. ఆ దేశంలో ప్రజాకేంద్రీకృత ప్రాజెక్టుల కోసం ఏకంగా 3 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించింది. ఈ ఏడాది ఆగస్టులో అప్గాన్‌ను ఆక్రమించి అధికారం చేపట్టిన తాలిబన్లు కూడా భారత్ భాగస్వామ్యాన్ని గుర్తించారు.
జీ20, బ్రిక్స్ సదస్సులు సహా ద్వైపాక్షిక చర్చల్లోనూ భారత్ ప్రతిసారి అఫ్గాన్ సమస్యను లేవనెత్తుతోంది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 10న రష్యా, ఇరాన్ సహా సెంట్రల్ ఆసియాలోని ఐదు దేశాల భద్రతా సలాహాదారులతో సమావేశం నిర్వహిస్తోంది(india meet on afghanistan). దిల్లీలో జరిగే ఈ భేటీకి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ నేతృత్వం వహిస్తారు(ajit doval meeting on afghanistan). ప్రాంతీయ సమస్యపై చర్చించేందుకు ఇన్ని దేశాలతో ఈ తరహా సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి.
ఏఏ దేశాలు హాజరవుతున్నాయి?
ఈ సమావేశానికి రష్యా, ఇరాన్, తజికిస్థాన్, కిర్జిస్థాన్, కజఖ్‌స్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు హజరవుతారు(nsa meeting on afghanistan). ఇంతకుముందు ఇరాన్ ఈ తరహా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ దేశమే 2018, 2019లో ఈ తరహా భేటీలకు ఆతిథ్యమిచ్చింది. అయితే భారత్ నిర్వహిస్తున్న సమావేశంలో అత్యధికంగా ఏడు దేశాలు పాల్గొంటున్నాయి.
చైనా, పాక్ మాటేంటి?
ఈ ఫార్మాట్‌ను అనుసరించి సమావేశానికి హాజరుకావాలని చైనా, పాకిస్థాన్‌కు కూడా భారత్ ఆహ్వానం పంపింది(india role in afghanistan ). అయితే ఊహించినట్టే ఈ రెండు దేశాలు భేటీలో పాల్గొనేందుకు నిరాకరించాయి. షెడ్యూల్ సమస్య కారణంగా తాము రాలేమని చైనా సాకు చెప్పింది. అయితే అఫ్గాన్ అంశంపై భారత్‌తో ద్వైపాక్షిక, బహుపాక్షిక చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని పేర్కొంది. గతంలో ఇరాన్ ఆతిథ్యమిచ్చిన రెండు సమావేశాలతో పాటు, బ్రిక్స్ సమావేశానికి చైనా హాజరైంది.
అఫ్గాన్ సమస్య పరిష్కారంలో భాగం కావాలాని పాకిస్థాన్ ఎప్పుడూ కోరుకోలేదని అధికారులు భావిస్తున్నారు. నిజానికి అఫ్గాన్ సంక్షోభానికి పాకిస్థానే కారణమని చెబుతున్నారు. తాలిబన్లకు మొదటి నుంచి ఆ దేశం సాయం చేస్తోందనే విషయం ప్రపంచానికి తెలిసిన బహిరంగ రహస్యం. అలాగే పాక్ గూఢచార సంస్థం ఐఎస్ఐ... అఫ్గాన్‌లోని హక్కానీ, ఐసిస్ ఖోరసన్కు సాయం చేస్తోందనే విషయమూ అందిరికీ తెలిసిందే.
అఫ్గాన్‌కు(afghanistan news ) ఇతర దేశాల నుంచి మానవతా సాయం అందకుండా పాకిస్థానే ప్రధాన అడ్డంకిగా మారింది. అఫ్గాన్ ప్రజలకు అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నప్పటికీ పాకిస్థానే.. దాన్ని వారికి చేరకుండా చేస్తోంది. ఇరాన్ గతంలో ఆతిథ్యమిచ్చిన సమావేశాలకు కూడా పాక్ హాజరుకాలేదు. ఇప్పడు భారత్ ఆహ్వానాన్ని కూడా తిరస్కరించింది.
ఏఏ అంశాలు చర్చిస్తారు?
ఏడు దేశాలు పాల్గొంటున్న ఈ సమావేశంలో(india meeting on afghanistan) అఫ్గాన్‌లో ఉగ్రవాదం, ఇతర దేశాలకు అక్కడి ఉగ్రకార్యకలాపాల వల్ల పొంచి ఉన్న ముప్పు, అక్కడి అతివాదంపై ప్రధానంగా చర్చ జరగనుంది. అఫ్గాన్‌లో ప్రస్తుతమున్న భావజాలం తమ దేశాలను కూడా ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఈ దేశాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే అఫ్గాన్‌లో డ్రగ్ ట్రాఫికింగ్, అమెరికా సైన్యం విడిచివెళ్లిన అత్యాధునిక ఆయుధాలను తాలిబన్లు దుర్వినియోగం చేస్తారేమోననే భయాలు ఉన్నాయి. వీటన్నింటికీ మించి తర్వత ఏం జరుగుతుందోననే అనిశ్చితిపై ఈ ఏడు దేశాల సమావేశంలో కీలక చర్చ జరిగే అవకాశముంది. పాకిస్థాన్‌కు మాత్రం ఈ అంశాలపై ఎలాంటి ఆందోళన లేదు. ఇప్పటికే ఆ దేశం తాలిబన్లకు మద్దతుగా ఉంటూ సంప్రదింపులు కొనసాగిస్తోంది.
తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తాయా?
ఇరాన్, రష్యా సహా ఈ సమావేశంలో పాల్గొంటున్న ఇతర దేశాలు అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని(afghan taliban news) గుర్తించేందుకు సముఖంగా లేవు. ఈ సమావేశం అజెండాలో అసలు ఈ విషయమే లేదని అధికారిక వర్గాలు తెలిపాయి. 1990ల నాటి తాలిబన్ ఆటవిక ప్రభుత్వానికి ప్రస్తుత తాలిబన్లకు ఏమాత్రం తేడా లేదని ఈ దేశాలు భావిస్తున్నాయి. అఫ్గాన్‌లో(afghanistan news latest) మైనారిటీల ప్రాతినిధ్యం, ఐక్యతా భావం, మహిళల హక్కులు, మానవహక్కులు వంటివి ఏడు దేశాల ఉమ్మడి అంశాలు.
రష్యా, ఇరాన్ సహా ఇతర మధ్య ఆసియా దేశాలు తాలిబన్లతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ తమ వైఖరెేంటో స్పష్టం చేశాయి. ఈ ప్రాంతంలో భారత్ కీలక భాగస్వామి అని అవి బలంగా నమ్ముతున్నాయి.
ఈ సమావేశంలో ఏడు దేశాల ఏకాభిప్రాయం, ఉమ్మడి అజెండా చర్చల్లో ప్రతిబింబిస్తుంది. ఇది ప్రోటోకాల్ ఆధారిత చర్చ కాదు.. వాస్తవ పరిస్థితులపై జరుగుతున్న సమావేశం. అయితే భేటీతో ఆసియా దేశాలు ఇస్తున్న సందేశాన్ని కాబుల్‌లో తాలిబన్లు ఏ విధంగా తీసుకుంటారనే విషయమే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఇదీ చదవండి:పాక్‌తో కలిసి చైనా కుట్ర- అధునాతన యుద్ధనౌకతో..