తెలంగాణ

telangana

ETV Bharat / bharat

10వేల మంది చైనా సైనికులు వెనక్కి!

తూర్పు లద్ధాఖ్​ సరిహద్దు వెంబడి ఉన్న 10వేల మంది సైనికులను చైనా వెనక్కి పంపనుంది. చలితీవ్రత అధికంగా ఉండటం వల్ల సైనిక శిక్షణా శిబిరాలను వాస్తవాధీన రేఖకి సుమారు 80నుంచి 100కిలోమీటర్లు వెనక్కి తరలించనుంది. ఫ్రంట్‌లైన్ ప్రాంతాల్లో సైనిక బలగాల సంఖ్యను మాత్రం యథావిధిగా కొనసాగించనుంది.

By

Published : Jan 12, 2021, 5:08 AM IST

indo china border, china, india
వెనక్కి తగ్గిన డ్రాగన్.. వాతావరణమే కారణమా!

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీనరేఖ వెంబడి లోతైనప్రాంతాల నుంచి 10వేల మంది సైనికులు కలిగిన శిక్షణా శిబిరాలను చైనా మార్చనుంది. చలితీవ్రత అధికంగా ఉండటం వల్ల ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. వాస్తవాధీన రేఖకి సుమారు 80నుంచి 100కిలోమీటర్లు వెనక్కి... సైనిక శిక్షణా శిబిరాలను తరలించనుంది. అయితే ఫ్రంట్‌లైన్ ప్రాంతాల్లో సైనిక బలగాల సంఖ్యను యథావిధిగా కొనసాగించనుంది.

సోమవారం తూర్పులద్దాఖ్‌లో పర్యటించిన త్రిదళాదిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్​కేఎస్​ భదౌరియా సైనిక స్థావరాలను పరిశీలించారు. ఎత్తైన ప్రాంతాల నుంచి దేశీయ సైనిక శిక్షణా స్థావరాలను కూడా మార్చనున్నట్లు తెలిపారు. భారత్‌-చైనాల మధ్య వాస్తవాధీనరేఖ వెంట 8నెలల నుంచి సైనిక ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇరుదేశాలు పర్వతప్రాంతాల్లోని వివిధప్రదేశాల్లో 50వేల చొప్పున సైనిక బలగాలను మోహరించాయి. రెండు దేశాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు.

ఇదీ చదవండి :'వాషింగ్టన్‌ దాడి' ఓ అందమైన దృశ్యం: చైనా

ABOUT THE AUTHOR

...view details