తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రభుత్వ పిరికితనంతో దేశ భవిష్యత్తుకు ముప్పు'

భారత్​ను సైబర్​ దాడులతో దెబ్బకొట్టేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.

China has mobilised conventional and cyber forces to threaten India
'భారత్​ను దెబ్బకొట్టేందుకు చైనా సైబర్ వ్యూహం'

By

Published : Mar 3, 2021, 7:35 PM IST

సైబర్​ దాడుల ద్వారా భారత్​కు ముప్పు కలిగించేందుకు చైనా ప్రతినభూనిందని కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వ పిరికితనం వల్ల రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ముప్పు పొంచి ఉందని ఆరోపించారు. దేశ భవిష్యత్తు అంధకారంలోకి వెళుతోందని దుయ్యబట్టారు.

నియంత్రణ రేఖ సమీపంలోని డెప్సాంగ్​ ప్రాంతంలో చైనా నిర్మాణాలు జరిపిన శాటిలైట్​ చిత్రాలను ఉద్దేశిస్తూ రాహుల్ ట్వీట్​ చేశారు. ఆ ప్రాంతాన్ని చైనా కబ్జా చేసిందని పేర్కొన్నారు. దౌలత్​ బెగ్ ఓల్డీని ఆక్రమించేందుకు డ్రాగన్​ ప్రయత్నాలు చేస్తోందన్నారు.

ఇటీవలే భారత్​-చైనా దేశాలు బలగాల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించిన వేళ రాహుల్​ ఈ విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి:ఆరుగురు కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం- ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details