ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. క్షుద్రపూజలు ముక్కుపచ్చలారని చిన్నారి ప్రాణాలు తీశాయి. నిందితులు బాలికను ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. శరీరంలోని అవయవాలను తొలగించారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఇదీ జరిగింది...
బాలిక శనివారం కనిపించకుండా పోయింది. ఆమె కోసం గ్రామస్థులు ఎంతో సేపు వెతికినా.. ఫలితం దక్కలేదు. ఆదివారం ఉదయం పొలం పనులకు వెళ్లిన వారికి.. ఊరి చివర పొలాల్లో ఉండే కాళీమాత గుడి వద్ద చిన్నారి మృతదేహం కనిపించింది. ఆమె శరీరంలోని అవయవాలను తొలగించారని గ్రామస్థులు తెలిపారు. ఇలా కేవలం క్షుద్రపూజల్లోనే జరుగుతుందని వారు పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. పంచనామా కోసం బాలిక మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా దోషులను శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: కొరడాతో కొట్టించుకున్న ఛత్తీస్గఢ్ సీఎం