అంధవిశ్వాసాలపై అవగాహన కల్పిస్తున్నా ఇంకా చాలా చోట్ల ప్రజలు వాటిని అనుసరిస్తున్నారు. అనేక చోట్ల జంతు బలులు ఇవ్వడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా ఒడిశాలో కొన్ని పండగల సమయంలో జంతు బలులు ఇవ్వడం అక్కడి సంస్కృతిలో భాగమైంది. ఇదే అక్కడి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపింది. కుక్క పిల్లతో ఆటలాడుకునే వయసులో ఆ మూగజీవిని బలి చేశారు బొలన్గిర్ జిల్లాకు చెందిన ఐదుగురు పిల్లలు.
ఇదీ జరిగింది..
బొలన్గిర్ జిల్లా పండారపిటా గ్రామంలో.. స్థానికంగా నిర్వహించే సులియా జాతరకు జంతుబలులు ఇవ్వడం ఆనవాయితీ. ఇదే ఆ గ్రామానికి చెందిన ఐదుగురు పిల్లలపై దుష్ప్రభావం చూపింది. ఈ అంధవిశ్వాసానికి ఆకర్షితులైన ఆ చిన్నారులు.. ఓ కుక్కపిల్లను ఊరేగించి, పూజలు నిర్వహించి దానిని అమానుషంగా చంపేశారు. ఆ తర్వాత దాని రక్తాన్ని తాగారు.
ఇది గమనించిన పలువురు గ్రామస్థులు పిల్లలను హుటూహటిన ఆస్పత్రికి తరలించారు. రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిన వైద్యులు.. ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
ఇదీ చూడండి :యుద్ధం ఆపాలని పుతిన్ను ఆదేశించగలమా?: జస్టిస్ రమణ