Children Covid Vaccine: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో చిన్నారులు, పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే అంశంపై ప్రభుత్వంలో విస్తృతంగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఇప్పుడే టీకాలు ఇవ్వడం అంత అత్యవసరమేమీ కాదని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్(ఎన్‌టీఏజీఐ) సభ్యుడొకరు తాజాగా ఓ జాతీయ మీడియాతో అన్నారు. ఇదే విషయాన్ని కేంద్రానికి కూడా చెప్పినట్లు పేర్కొన్నారు.
Vaccination For Children Under 12:
"భారత్‌లో 12ఏళ్ల లోపు చిన్నారుల్లో కొవిడ్ మరణాలు నమోదు కాలేదు. ఈ వయసు వారిలో కొందరికి కరోనా సోకినప్పటికీ ఆ తీవ్రత తక్కువగానే ఉంది. ఈ డేటాను విశ్లేషించిన తర్వాత చిన్నారులకు ఇప్పుడే కరోనా టీకాలు ఇవ్వడం అత్యవసరం కాదని అనిపిస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పాం" అని ఎన్‌టీఏజీఐ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దీనిపై తమ ప్యానెల్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
Vaccination For Children News: