తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాలుగు చేతులు, కాళ్లతో చిన్నారి అవస్థ.. సాయానికి ముందుకొచ్చిన సోనూసూద్​ - సోనూసూద్​ మంచి మనసు

SonuSood Helps Child: పుట్టుకతోనే నాలుగు కాళ్లు, చేతులతో జన్మించిన బిహార్‌కు చెందిన ఓ చిన్నారికి వైద్యం చేయించడానికి నటుడు సోనూసూద్​ ముందుకు వచ్చారు. ముంబయి చేరుకున్న ఆ చిన్నారి కుటుంబాన్ని సోనూ స్వయంగా కలిసి.. త్వరలో ఆమె జీవితంలో కొత్త ఆనందం వస్తుందంటూ ట్వీట్​ చేశారు.

SonuSood Helps Child
SonuSood Helps Child

By

Published : Jun 3, 2022, 12:53 PM IST

సోనూసూద్ దాతృత్వం.. నాలుగు చేతులు, కాళ్లతో జన్మించిన చిన్నారికి శస్త్రచికిత్స..

SonuSood Helps Child: కరోనా కష్టకాలంలో దేశవ్యాప్తంగా వందలాది మంది పేదలకు తనవంతు సాయం చేసి.. కీర్తి గడించిన నటుడు సోనూసూద్‌. తాజాగా ఆయన మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. నాలుగు కాళ్లు, చేతులతో జన్మించిన ఓ చిన్నారికి ముంబయిలో చికిత్స చేయిస్తున్నారు.

బిహార్‌కు చెందిన చౌముఖి కుమారి అనే చిన్నారి.. పుట్టుకతోనే నాలుగు కాళ్లు, చేతులతో జన్మించింది. నిరుపేద కుటుంబం కావడం వల్ల చిన్నారికి చికిత్స అందించే ఆర్థిక స్థోమత లేక ఆమె తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడ్డారు. చిన్నారి కుటుంబంలో ఆమె అక్క తప్ప మిగతా అందరూ అంగవైకల్యంతో జన్మించినవారే. చిన్నారి తల్లిదండ్రులు.. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నడిపిస్తున్నారు.

అయితే తమ చిన్నారి వైద్యానికి సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు రావాలని తల్లిదండ్రులు సోషల్​ మీడియా వేదికగా వేడుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న సోనూసూద్.. సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. చికిత్స కోసం పాపను ముంబయి తీసుకురావాలని కోరారు. ఇక, ముంబయి చేరుకున్న ఆ చిన్నారిని కలిసిన వీడియోను సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. త్వరలో చౌముఖి జీవితంలో కొత్త ఆనందం రాబోతోందంటూ ట్వీట్​ చేశారు. అదే సమయంలో, తమ బిడ్డ వైద్యానికి సహాయం చేస్తున్న సోనూసూద్ తమకు దేవుడు అని చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు.

ఇవీ చదవండి:సింగర్ హత్యతో దిగొచ్చిన పంజాబ్​ సర్కార్.. వారికి భద్రత పునరుద్ధరణ!

కశ్మీర్​లో ఉద్రిక్త పరిస్థితులు.. అమిత్​ షా, డోభాల్​ అత్యవసర భేటీ

ABOUT THE AUTHOR

...view details