చిన్నారిని ఎత్తుకెళుతున్న దృశ్యాలు దిల్లీలో ఆరేళ్ల బాలికపై అత్యాచార ఘటన వెలుగు చూసింది. తీవ్ర గాయాలున్న స్థితిలో బాలికను చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.
ఆడుకుంటుండగా..
శుక్రవారం ఉదయం తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారి కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. అయితే.. చాలాసేపటి తర్వాత కొంత దూరంలో చిన్నారి ఏడుస్తూ కనిపించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. గాయపడి ఉన్న చిన్నారిని ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలో నిందితుడిని గుర్తించారు. అందులో అతడు బాలికను వెంట తీసుకెళ్లడం కనిపించింది. మరోవైపు.. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు.
ఇవీ చదవండి: