బిహార్ భాగల్‌పుర్‌లో దారుణం జరిగింది. ఇద్దరు భార్యాభర్తల మధ్య చెలరేగిన వివాదం వల్ల మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం మాయాగంజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. గొడవకు గల కారణాలను తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
భాగల్‌పుర్‌కు చెందిన ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ చెలరేగింది. దీంతో వారు ఒకరిపై ఒకరు పదునైన కత్తితో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల బల్వీర్ సింగ్ అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మర్గమధ్యలోనే అతడు ప్రాణాలు విడిచాడు. ఆ బాలుడితో పాటు నిందితులు, ఇద్దరు పిల్లలకు సైతం గాయాలయ్యాయి. వీరంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.