తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అన్నం అడిగితే అమ్మ కొడుతోంది సార్​'.. బాలుడి ఫిర్యాదు.. పోలీసులు ఏం చేశారంటే? - తల్లిపై బాలుడి ఫిర్యాదు

తినడానికి అన్నం పెట్టమని అడిగితే అమ్మ కొడుతోందని ఓ 8 ఏళ్ల పిల్లవాడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ బాలుడ్ని చూసి విస్తుపోయిన పోలీసులు.. ముందు కడుపు నిండుగా భోజనం పెట్టారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

Child complains to mother in Sitamarhi
Etv BhChild complains to mother in Sitamarhi Child complains to mother in Sitamarhi arat

By

Published : Sep 14, 2022, 11:08 AM IST

'అన్నం అడిగితే అమ్మ కొడుతోంది. వేళకు అన్నం పెట్టదు. ఒక్కోసారి నేను తింటుంటే పళ్లెం లాక్కొని విసిరేస్తుంది సార్‌' అంటూ తల్లిపై ఫిర్యాదుతో పోలీస్‌స్టేషనుకు వచ్చిన 8 ఏళ్ల బాలుడిని చూసి బిహార్‌ పోలీసులు విస్తుపోయారు. సీతామఢీలోని చంద్రిక మార్కెట్‌ వీధి సిటీ పోలీసుల ముందు ఏడుస్తూ నిలుచున్న ఆ చిన్నారిని చూసి ఏమిచేయాలో కాసేపు వారికి పాలు పోలేదు. ముందుగా కడుపు నిండా అన్నం పెట్టారు.

అన్నం పెట్టట్లేదని తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమారుడు

వివరాలు ఆరా తీస్తే.. తాను నాలుగో తరగతి చదువుతున్నానని, నాన్న మరోచోట ఉంటాడని బాలుడు తెలిపాడు. చెప్పిన చిరునామా ప్రకారం పోలీసులు ఆ బాలుణ్ని ఇంటికి తీసుకువెళ్లారు. తల్లిని విచారించగా.. అలాంటిదేం లేదని, ఒక్కోసారి అల్లరి చేస్తే తిడుతుంటానని ఆమె చెప్పారు. ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పి తాము వెనుదిరిగినట్లు పోలీసు అధికారి రాకేశ్‌ కుమార్‌ తెలిపారు. ఈ వ్యవహారం తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ABOUT THE AUTHOR

...view details