Child Fell in Tub: రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో హృదయవిదారక సంఘటన జరిగింది. ఏడాదిన్నర చిన్నారి ఆడుకుంటూ వెళ్లి వేడినీటితో ఉన్న బాత్‌టబ్‌లో పడి ప్రాణాలు కోల్పోయింది. బయానా ప్రాంతంలోని రేవాద్‌పురా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
వేడినీటి టబ్‌లో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి - rajasthan girl fell in hot water tub
Child Fell in Tub: పిల్లలతో ఆడుకుంటూ ఏడాదిన్నర చిన్నారి వేడినీటితో ఉన్న బాత్‌టబ్‌లో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో జరిగింది.
బంజారిపురాకు చెందిన పూజా రాజ్‌పుత్- కుల్దీప్ రాజ్‌పుత్‌ల కుమార్తె దృష్టి రాజ్‌పుత్. పుట్టింటివారిని చూసివెళ్లడానికి పూజ తన బిడ్డతో కలిసి రేవాద్‌పురా వచ్చింది. అమ్మమ్మ ఊర్లో శుక్రవారం ఆరుబయట పిల్లలతో కలిసి ఆడుకుంటూ వెళ్లి వేడినీటితో ఉన్న బాత్‌టబ్‌లో పడిపోయింది. పిల్లల అరుపులతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. దృష్టిని బయటికి తీసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చిన్నారి మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు కమ్ముకున్నాయి.
ఇదీ చదవండి:పట్టాలపై పడిపోయిన వ్యక్తి.. దూసుకొచ్చిన రైలు.. తర్వాత?