మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఆడుకుంటూ వెళ్లిన 8 ఏళ్ల బాలుడు 400 అడుగుల బోరుబావిలో పడిపోయాడు. బెతుల్ జిల్లాలోని మండవి గ్రామంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 400 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో తన్మయ్ దియావర్ అనే బాలుడు 60 అడుగుల వద్ద ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. బోరుబావిలో బాలునికి ఊపిరి ఆడేలా ఆక్సిజన్ పైపులు పంపించారు.
'డాడీ.. చీకటిగా ఉంది.. త్వరగా బయటకు తీయండి'.. 400 అడుగుల లోతు బోరుబావిలో పడ్డ చిన్నారి.. - boy stuck in borewell
8 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు. మధ్యప్రదేశ్‌లో ఘటన జరిగింది. బాలుడిని కాపాడేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బాలునికి ఊపిరి ఆడేలా ఆక్సిజన్ పైపులు బావిలోకి పంపించారు అధికారులు. ప్రొక్లెయిన్ యంత్రాలు, ట్రాక్టర్లను రంగంలోకి దిగి సహాయక చర్యలు చేస్తున్నారు.
ప్రొక్లెయిన్ యంత్రాలు, ట్రాక్టర్లను రంగంలోకి దింపిన అధికారులు.. బోరుబావి చుట్టూ మట్టిని తవ్వుతున్నారు. బాలుడి చేతిని తాడుతో కట్టి లాగే ప్రయత్నం చేశారు అధికారులు. 12 అడుగుల వరకు బాలుడు బాగానే పైకి వచ్చినప్పటికి ఆ తరువాత తాడు తెగిపోయింది. దీంతో మరో మార్గం ద్వారా బాలుడిని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా బాలుడితో తండ్రి మాట్లాడేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆ సమయంలో తండ్రితో మాట్లాడిన బాలుడు "ఇక్కడ చీకటిగా ఉంది. భయం వేస్తోంది నాన్న.. నన్ను త్వరగా బయటకు తీయండి" అని అన్నాడు. అనంతరం కొద్దిసేపటికి ఎటువంటి స్పందన బాలుడి నుంచి రాలేదు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చిన్నారి క్షేమం కోసం కోరుతూ ఓ ట్వీట్ చేశారు.