బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడు కొన్ని గంటల తర్వాత ప్రాణాలతో బయట పడ్డాడు. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు 40 అడుగులు లోతు బావిలో పడ్డ మవును సురక్షితంగా బయటకు తీశారు రెస్క్యూ సిబ్బంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని హాపుడ్లో మంగళవారం జరిగింది.
ఇదీ జరిగింది
మొహల్లా పూల్గఢీలోని కోట్లాకు చెందిన మోశిన్ అనే వ్యక్తి కుమారుడు మవు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు 40 అడుగుల లోతు బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం ఘటనా స్థలానికి చేరుకుని పిల్లాడిని రక్షించేందుకు ప్రయత్నించారు. బాలుడికి ఊపిరి ఆడేందుకు వీలుగా బోరుబావిలోకి ఆక్సిజన్‌ను పంపించారు. కొన్ని గంటలు శ్రమించి.. అతడ్ని సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఈ బోరుబావిని 35 ఏళ్ల క్రితం మున్సిపాలిటీ అధికారులు తవ్వారు. గత 10 ఏళ్లుగా ఈ బోరుబావి నిరుపయోగంగా ఉందని స్థానికులు తెలిపారు.