ఉత్తర్ప్రదేశ్ ఫతేబాద్ జిల్లాలో ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి కథ సుఖాంతమైంది. సుమారు 9 గంటల పాటు శ్రమించి బాలుడిని రక్షించాయి సహాయక బృందాలు. బోరుబావి నుంచి బయటపడిన బాలుడిని వెంటనే వైద్య పరీక్షలకు తరలించారు.
బోరుబావిలో పడిన చిన్నారి కథ సుఖాంతం - బోరుబావిలో బాలుడు
ఉత్తర్ ప్రదేశ్లో బోరుబావిలో పడిన నాలుగేళ్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. సుమారు 9 గంటలపాటు శ్రమించి రక్షించాయి సహాయక బృందాలు.

బోరుబావిలో బాలుడు
ఇదీ జరిగింది..
జిల్లాలోని ధారియాయి గ్రామానికి చెందిన చోటేలాల్ తన ఇంటి ముందు గతంలో బోరుబావిని తవ్వించాడు. దానికి అమర్చిన పైపులు రెండు రోజుల క్రితం తీసేశాడు. బోరు గుంతను అలాగే వదిలేశాడు. చోటేలాల్ కుమారుడు శివ(4) ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. చిన్నారిని సురక్షితంగా బయటకు తీశాయి.