Child Donate Kidney To Elders : 13 నెలల చిన్నారి రెండు కిడ్నీలను 30 ఏళ్ల వ్యక్తికి అమర్చారు బెంగళూరులోని ఫోర్టిస్ ఆస్పత్రి వైద్యులు. ఆ ఆస్పత్రిలోని యూరో ఆంకాలజీ, రోబోటిక్ సర్జరీసీనియర్ డైరెక్టర్ డాక్టర్ శ్రీహర్ష హరినాథ్ నేతృత్వంలోని వైద్యుల బృందం.. రోబోటిక్ ఎన్-బ్లాక్ అనే విధానంలో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల రోగి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
Kidney Transplant Robotic Surgery : 'కిడ్నీఫెయిల్యూర్తో బాధపడుతున్న ఓ 30 ఏళ్ల వ్యక్తి.. హీమో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. అతడికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చింది. ఓ 13 నెలల చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. ఆ చిన్నారి తల్లిదండ్రుల అంగీకారంతో కిడ్నీలను దానంగా పొందాడు రోగి. అయితే, ఆ చిన్నారి బరువు 7.3 కిలోలు మాత్రమే. 30 ఏళ్ల వ్యక్తి 50 కిలోల బరువు ఉన్నాడు. కాబట్టి అతడికి ఆ చిన్నారి కిడ్నీలు ట్రాన్స్‌ప్లాంట్ చేయడం సవాలుతో కూడుకున్న పని. ఈ ఆపరేషన్‌ను ఛాలెంజ్‌గా తీసుకుని.. రోబోటిక్ ఎన్-బ్లాక్ విధానం ద్వారా కిడ్నీలు మార్పిడి చేశాం. ఈ వినూత్న విధానం ద్వారా మార్పిడి చేసిన మూత్రపిండాలు.. గ్రహీత శరీర బరువుకు తగిన పరిమాణంలో పెరుగుతాయి. దాదాపు నాలుగు గంటల పాటు ఈ శస్త్రచికిత్స జరిగింది. ఈ సంక్లిష్ట సర్జరీ తర్వాత, రోగిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచాం. 12 రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి అతడు డిశ్చార్జ్ అయ్యాడు' అని డాక్టర్ కేశవమూర్తి తెలిపారు.