తెలంగాణ

telangana

ETV Bharat / bharat

70 సెకన్లలో చాలీసా చదివి 13 ఏళ్ల బాలిక రికార్డు - కర్ణాటక చిన్నారి రికార్డు

గుక్కతిప్పకుండా హనుమాన్​ చాలీసా చెప్పి 13 ఏళ్ల కర్ణాటక చిన్నారి ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించింది. కేవలం 1.10 నిమిషాల్లోనే చాలీసా చెప్పింది ఈ చిన్నారి.

India Book of Record for chanting a Hanuman Chalisa
చాలీసా చదవి... ఓ చిన్నారి రికార్డు!

By

Published : Jan 9, 2021, 8:19 PM IST

హనుమాన్ చాలీసా కంఠస్థం చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటారు కొందరు. కానీ, అది పూర్తి చేయలేక విఫలమవుతుంటారు. కర్ణాటకకు చెందిన 13 ఏళ్ల చిన్నారి మాత్రం ఇందుకు భిన్నం. లాక్​డౌన్​లో తనకు దొరికిన ఖాళీ సమయాన్ని హనుమాన్​ చాలీసా కంఠస్థం చేసే అమృత గడియల్లా భావించింది. కృత నిశ్చయంతో మొత్తం నేర్చుకుని గుక్కతిప్పకుండా 'చాలీసా' చదివి రికార్డులకెక్కింది.

చాలీసా చెబుతోన్న తన్మయి

కొత్త విషయాలంటే మక్కువ...

కర్ణాటక చిక్కమగలూరులోని విజయపురకు చెందిన జి.తన్మయి వశిష్టకు చిన్నప్పటి నుంచే కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఆసక్తి ఎక్కువ. 8వ తరగతి చదువుతోన్న తన్మయి... కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​లో హనుమాన్​ చాలీసా నేర్చుకోవాలని సంకల్పించింది. ఎట్టకేలకు మొత్తం నేర్చుకుని 1.10 నిమిషాలలోనే గుక్కతిప్పకుండా చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు సంపాదించింది.

ఇతర కళల్లోనూ....

తనకున్న ఆసక్తితో బొమ్మలు గీయడం, పాటలు పాడడం, పద్యాలు నేర్చుకోవడం వంటి ఇతర కళల్లోనూ ప్రావీణ్యం సంపాదించింది తన్మయి.

"తన్మయి ఈ ఘనత సాధిస్తుందని అస్సలు ఊహించలేదు. చిక్కమగలూరు వాసులంతా తనను చూసి గర్వపడేలా చేసింది. లాక్​డౌన్​లో సమయం వృథా చేయకుండా చాలీసా నేర్చుకుంది".

-క్రిప గిరీష్, తన్మయి తల్లి.

తన్మయి గతంలోనూ పలు కార్యక్రమాల్లో పాల్గొని ఎన్నో అవార్డులు గెలుచుకుంది.

ఇదీ చదవండి:జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్​ షురూ

ABOUT THE AUTHOR

...view details