తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లష్కరే ముస్తఫా' చీఫ్ హిదాయతుల్లా అరెస్ట్​ - ఉగ్రవాదుల పట్టివేత

లష్కరే ముస్తఫా చీఫ్ హిదాయతుల్లాను జమ్ముకశ్మీర్​ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కోసం ఈ సంస్థ పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

terrorists, lashker e mustafa
లష్కరే ముస్తఫా చీఫ్ అరెస్ట్​

By

Published : Feb 6, 2021, 6:07 PM IST

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాద సంస్థ లష్కరే ముస్తఫా అధినేత హిదాయతుల్లా మాలిక్​ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జమ్ము, అనంత్​ నాగ్​ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్​లో భాగంగా జమ్ము పట్టణ శివార్లలోని కుంజ్​వాణి బైపాస్​ వద్ద ఈ ముష్కరుడిని పట్టుకున్నారు. నిందితుడు దక్షిణ కశ్మీర్​లోని షోపియాన్​ జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు.

నిందితుడు హిదాయతుల్లా
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్​​కు హిదాయతుల్లా నేతృత్వంలో లష్కరే ముస్తఫా అనుబంధ సంస్థగా పనిచేస్తోందని పోలీసులు వెల్లడించారు. నిందితుడు నుంచి తుపాకీ, గ్రెనేడ్​ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్టు సమయంలో సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :రూ.20 కోసం గొడవ- ఇడ్లీ వ్యాపారి మృతి

ABOUT THE AUTHOR

...view details