తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిడ్​ కట్టడిపై సీడీఎస్​ రావత్​తో మోదీ భేటీ - రిటైర్​ మిలటరీ వైద్యులు

దేశంలో కొవిడ్​ మహమ్మారిపై పోరాడేందుకు కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. పదవీ విరమణ పొందిన మిలటరీ వైద్యాధికారుల సేవల్ని మళ్లీ ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు త్రిదళాధిపతి బిపిన్​ రావత్​తో సమావేశమయ్యారు మోదీ.

PM Modi, Bipin Rawat
ప్రధాని నరేంద్ర మోదీ, త్రివిధ దళాధిపతి బిపిన్​ రావత్​

By

Published : Apr 26, 2021, 4:58 PM IST

దేశంలో కరోనా విధ్వంసం కొనసాగుతున్న వేళ.. పదవీ విరమణ పొందిన మిలటరీ వైద్యాధికారుల సేవలను పునఃవినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆర్మీ కమాండ్‌ ప్రధాన కార్యాలయం సహా.. అన్ని మిలటరీ ప్రధాన కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

అంతకుముందు.. త్రిదళాధిపతి బిపిన్‌ రావత్‌తో సమావేశమయ్యారు మోదీ. కొవిడ్‌ కట్టడికి ఆర్మీ చేపడుతున్న చర్యల గురించి రావత్​ను అడిగి తెలుసుకున్నారు. విదేశాల నుంచి ఆక్సిజన్, ఔషధాల సరఫరాకు వైమానిక దళం చేస్తున్న చర్యలను బిపిన్‌ రావత్‌ ప్రధానికి వివరించారు. విస్తృత స్థాయిలో వైద్య సౌకర్యాలు కల్పించేందుకు సైన్యం కృషి చేస్తున్నట్లు ప్రధానికి తెలిపిన రావత్‌.. సాధ్యమైనంత మేర ఆర్మీ వైద్య సదుపాయాలను పౌరులకు కల్పిస్తున్నట్లు చెప్పారు. సైన్యంలో గడిచిన రెండేళ్లలో పదవి విరమణ పొందిన వైద్యాధికారుల సేవలను వినియోగించుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details