Bipin Rawat Helicopter Accident: తమిళనాడు కూనూర్ సమీపంలో హెలికాప్టర్ ప్రమాదం జరిగిన తరుణంలో.. ఇప్పుడు దేశమంతటా త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ గురించి చర్చ నడుస్తోంది. క్రాష్ అయిన హెలికాప్టర్లో బిపిన్ రావత్, ఆయన భార్య కూడా ఉన్నారు. మొత్తం 14 మందిలో 13 మంది చనిపోయినట్లు అధికారులు నిర్ధరించారు. వీరిలో రావత్ కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో రావత్.. స్ఫూర్తిమంతమైన ప్రస్థానాన్ని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సైన్యానికి సేవలు అందిస్తున్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. అదే సైన్యంలో దాదాపు 40 ఏళ్ల సేవలు అందించి, ఎన్నో శిఖరాలను అధిరోహించారు.
అపార ప్రతిభాశాలి..
Bipin Rawat Latest News: 1958లో మార్చి 16న ఉత్తరాఖండ్‌లో హిందూ గర్వాలీ రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించారు. ఆయన కుటుంబం తరతరాలుగా సైన్యానికి సేవలు అందిస్తోంది. బిపిన్ తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ హోదాలో పనిచేశారు. ఆయన తల్లి ఉత్తరకాశీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమార్తె.
Bipin Rawat Helicopter: దెహ్రాదూన్‌లోని కాంబ్రియన్ హాల్, సెయింట్ ఎడ్వర్డ్స్ పాఠశాలలో రావత్ విద్యాభ్యాసం చేశారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఖాదక్వాస్ల), ఇండియన్ మిలిటరీ అకాడమీ(దెహ్రాదూన్), వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో చదువుకున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఆయన ప్రతిభకు 'స్వార్డ్ ఆఫ్ హానర్' అవార్డు లభించింది. అమెరికా కాన్సాస్‌లోని యూఎస్ ఆర్మీ కమాండ్, జనరల్ స్టాఫ్ కాలేజీలో హైయర్ కమాండ్ కోర్స్‌ను చేశారు.
నేపాల్ ఆర్మీకీ అధ్యక్షత..!
Bipin Rawat awards: 1978 డిసెంబర్ 16న ఆర్మీలో చేరారు రావత్. తన తండ్రి పనిచేసిన గోర్ఖా రైఫిల్స్ 11కు చెందిన ఐదో బెటాలియన్‌లోనే బాధ్యతలు చేపట్టారు. ఎత్తైన ప్రాంతాల్లో చేసే యుద్ధాల్లో రావత్‌కు తిరుగులేదు. పదేళ్ల పాటు తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌లోని ఉరీలో మేజర్ హోదాలో పనిచేశారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 2016 డిసెంబర్ 17న ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎంపికయ్యారు. ఇద్దరు సీనియర్లను వెనక్కి నెట్టి ఆయన ఈ పదవి దక్కించుకున్నారు. గోర్ఖా బ్రిగేడ్ నుంచి ఆర్మీ చీఫ్‌గా ఎదిగిన ముగ్గురు అధికారుల్లో రావత్ ఒకరు. రావత్.. నేపాల్ ఆర్మీకి గౌరవాధ్యక్షులు కూడా.
ఇదీ చదవండి:'పీఓకే' స్వాధీనానికి భారత సైన్యం సిద్ధం : రావత్
కీలక మిషన్లు..