Mamata Makes Panupuri: బంగాల్లోని డార్జిలింగ్‌కు వెళ్లిన పర్యటకుల్లో కొందరికి అరుదైన అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన పానీపూరిని వారంతా రుచిచూశారు. నాలుగు రోజుల ఉత్తర బంగాల్ పర్యటనలో ఉన్న మమత.. మంగళవారం అనూహ్యంగా రోడ్డు పక్కనున్న ఓ దుకాణం వద్ద ఆగారు. అక్కడ ఉన్నవారికి స్వయంగా పానీపూరి చేసి వడ్డించారు. అక్కడి వారితో కాసేపు మాట్లాడారు. మమత పానీపూరి రుచి చూసిన వారిలో స్థానికులతో పాటు భారత్‌లోని వేర్వేరు రాష్ట్రాల పర్యటకులతో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు చిన్నారులు కూడా ఉన్నారు.
గతంలో మమత ఇదే తరహాలో ఓ దుకాణంలో మోమోలు చేసి, అక్కడి వారికి రుచి చూపించారు. ఆ దుకాణం నడుపుతున్న స్వయం సహాయక బృందంలోని మహిళతో మాట్లాడారు. శాశ్వత దుకాణం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా అధికారులు ఆమెకు కొత్త దుకాణం ఏర్పాటు చేయించారు. ఇప్పుడు అదే దుకాణానికి మమత వెళ్లి పానీపూరి చేసి పెట్టారు.